Pawan Kalyan: ఒక్క టీజర్ తో రూ. 300 కోట్ల ఆఫర్.. ఆ ఘనత పవన్ కళ్యాణ్ కే సొంతం?

Pawan Kalyan: టాలీవుడ్ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు పరిచయం అక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పలు సినిమాలో నటించి తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తక్కువ సినిమాలో నటించినప్పటికీ.. వందల సినిమాల్లో నటించిన క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక తన ప్రత్యేక యాటిట్యూడ్ తో పవన్ ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. కేవలం పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా చాలా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్నాడు.

అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ సీఎంగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలని బాగా కష్టపడుతున్నాడు. ఎలాగైనా ప్రజల్లో మార్పు తీసుకొచ్చి సమాజాన్ని బాగు చేయాలని పవన్ కళ్యాణ్ బాగా కష్టపడుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు సినిమాలోని ఒక వీడియో గ్లిమ్స్ ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఈ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు వేసుకున్నారు.

అంతేకాకుండా ప్రేక్షకులు కూడా ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమా పరంగా ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇతర భాషల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతానికి అన్ని భాషలకు కలిపి 300 కోట్ల రూపాయలు థియేట్రికల్ ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. కేవలం ఒక వీడియో గ్లిమ్స్ కి 300 కోట్లు ఆఫర్ రావడం ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి సొంతమని కొంతమంది భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -