Jogaiah – Mudragada: జోగయ్య అలా.. ముద్రగడ ఇలా.. కాపులపై వారికున్న చిత్తశుద్ధి ఇదేనా?

Jogaiah – Mudragada: ఏపీలో కాపుల మద్దతు లేనిదే ఏపార్టీ కూడా అధికారంలోకి రావడం కష్టమే. కాపులు ఏ పార్టీకి మద్దతిస్తే అదే పార్టీ సీఎం కుర్చీ సొంతం చేసుకుంటుంది. అయితే, కాపులు ఎప్పుడూ రాజ్యాధికారానికి దూరంగానే ఉంటున్నారు. దానికి కారణం రాష్ట్రంలోని కాపు నేతలు తలో దారి పట్టడమే. కాపుల ఐక్యత కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకతాటిపైకి రావడం కుదరడం లేదు. విచిత్రం ఏంటంటే.. కాపు సాధికారిత కోసం పోరాటం చేస్తున్న వారి అడుగులే అనుమానాస్పదంగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య తీరు వివాదాస్పదం అవుతోంది.

ఇద్దరూ కూడా కాపులకు రాజ్యాధికారం రావాలని.. కాపులు మరింత అభివృద్ధి చెందాలని కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అయితే, వారి పోరాటంపై పలు ప్రశ్నలు వ్యక్త మవుతున్నాయి. మొదట హరిరామ జోగయ్య విషయానికి వచ్చినట్టైతే.. కాపుల కోసం ఆయన కాపు సంక్షేమ సేనను స్థాపించారు. ఆయన కాపుల సంక్షేమం పేరతో తరచూ పవన్‌కు సలహాలు ఇస్తూ ఉంటారు. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన సగం సీట్లు డిమాండ్ చేయాలని కోరారు. అంతేకాదు సీఎం పదవి కూడా రెండున్నరేళ్లు అడగాలని సూచించారు. హరిరామ సూచనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పవన్ లైట్ తీసుకున్నారు. పైగా హరిరామ జోగయ్య ఏమైనా సలహాలు ఇవ్వాలంటే డైరక్ట్‌గా తనతో చెప్పాలి కానీ.. బహిరంగ లేఖలు రాస్తూ వచ్చారు. ఆయన ఇచ్చిన సలహాలు పాటించలేదని.. కాపులను పవన్ తాకట్టు పెడుతున్నారంటూ బహిరంగ లేఖలు రాస్తూ వచ్చారు. హరిరామ జోగయ్య వ్యవహారం మొత్తం జగన్ కు అనుకూలంగానే ఉంది. అందుకే పవన్ ఆయన్ని పట్టించుకోలేదు. తన పార్టీ బలానికి తగిన విధంగా టీడీపీతో పొత్తులో భాగంగా సీట్లు తీసుకున్నారు. దీంతో హర్ట్ అయిన హరిరామ జోగయ్య కాపు సంక్షేమసేనను రద్దు చేశారు. ఈ పెద్దాయన జనసేన కోసమో, పవన్ కోసమో కాపు సంక్షేమసేనను ఏర్పాటు చేయలేదు. కానీ.. పవన్ తన సలహాలు ఖాతరు చేయలేదని ఆ ఆర్గనైజేషన్ ను రద్దు చేశారు. అంటే ఆయనకు కాపులపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోంది.

ఇక, ముద్రగడ పద్మనాభం విషయానికి వచ్చినట్టైతే ఆయన కూడా కాపుల్లో బలమైన నేతగా ఎదిగారు. అయితే ఆయన కేవలం తన రాజకీయ భవిష్యత్ కోసమే కాపులను వాడుకున్నారు. కాపుల ఉద్దరణ కోసం చాలా పోరాటాలు చేశారు. ఆయన పోరాటంలో కూడా ఎక్కడా చిత్తశుద్ధి కనిపించలేదు. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. తునిలో ట్రైన్ తగలబడిన ఘటన కూడా అందరికీ తెలిసిందే. అప్పుడు చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు తొలగించారు. కానీ, అప్పుడు ముద్రగడలో ఎలాంటి స్పందన లేదు. రిజర్వేషన్ల ఎందుకు తొలగించారనే ప్రశ్నే లేదు. పైగా జగన్‌కు అనుకూల వైఖరి తీసుకున్నారు. గత ఏడాది చేసిన వారాహి యాత్రలో పవన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు ద్వారంపూడిని సపోర్ట్ చేస్తూ ముద్రగడ పవన్ కు బహిరంగ లేఖ రాశారు. ద్వారంపూడి గొప్పవాడని.. పవన్ చేతకాని వాడని ఆ లేఖల సారంశం. అంతేకాదు.. పవన్‌ను, జనసేనను ఛాలెంజ్ చూస్తూ కూడా లేఖలు రాశారు. వైసీపీలో ఏ ఎంపీ సీటో లేకపోతే ఎమ్మెల్యే సీటో సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ జగన్ టికెట్ ఇవ్వరని తెలిసి.. జనసేన లేదా టీడీపీలో చేరుతానని ప్రకటించారు. వైసీపీలో మాత్రం చేరేది లేదని తేల్చి చెప్పారు. అయితే.. ముద్రగడ వైఖరిని గ్రహించిన చంద్రబాబు, పవన్ ఆయన్నిపట్టించుకోలేదు. దీంతో.. మళ్లీ వైసీపీ గూటికి చేరుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని జగన్ గత ఎన్నికల్లో ప్రకటించారు. మరి కాపులను ఉద్దరించడానికే పుట్టానన్నట్టు ఫీలవుతున్న ముద్రగడ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వని పార్టీలోకి ఎలా చేరుతారో ఆయనే సమాధానం చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -