Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా.. హరీష్ శంకర్ సమాధానం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని ఇచ్చారు. ఎప్పటినుంచో ఈ సినిమాపై చాలా డౌట్లు ప్రేక్షకులకి ఉన్నాయి.

ఇదే సమయం అనుకొని చాలా ప్రశ్నలు సంధించారు. అందులో ఒక వ్యక్తి ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అంటున్నారు నిజమేనా అని అడిగాడు. నా మీద నమ్మకం ఉంచండి, మీ ఎదురుచూపులకు తగ్గట్లు సినిమా ఉంటుంది మీరు ఎంత భారీగా అంచనాలు పెట్టుకున్నా వాటిని ఈ చిత్రం కచ్చితంగా అందుకుంటుంది అని సమాధానం ఇచ్చాడు హరీష్. భగత్ సింగ్ గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా పనిచేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది ఫలితం కాదు.

అయినా దానికి మించి ఉండాలని కోరుకుందాం అన్నాడు. మరో నెటిజన్ మీ సినిమాలు రీమేక్ లా ఉంటాయని టాక్ వినిపిస్తుంది, మీరు కాపీ కంటెంట్ వాడతారా అని అడగగా నా వర్క్ నిజంగా తెలిసిన వాళ్ళు వాటిని రీమేక్లు అని పిలవడానికి సిగ్గుపడతారు. నా పనిని చూసి నేను ఎప్పుడు గర్వపడతాను అని సమాధానం ఇచ్చాడు హరీష్. అయితే మరొక నెటిజన్ ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అని అడిగినప్పుడు ఇది యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది.

కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని చెప్పాడు. అలాగే మరొక నెటిజన్ పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు ఒత్తిడికి గురవుతారా అని అడిగితే ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది కానీ దాన్ని జయించగలగాలి అని చెప్పాడు హరీష్. భవిష్యత్తులో ఏ జోన్ లో సినిమాలు తీస్తారు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా మానవ సంబంధాలు, లవ్ స్టోరీలు ఈ రెండు జోన్లు ఎక్కువగా తీస్తాను అంటూ సమాధానాలు చెప్పుకొచ్చాడు హరీష్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -