Kiccha Sudeep: హీరో కిచ్చాసుదీప్ కు దారుణంగా బెదిరింపులు.. ఏమైందంటే?

Kiccha Sudeep: కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ గురించి మనందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కిచ్చా సుదీప్ పేరు మారుమోగి పోతోంది. ఇది ఇలా ఉంటే కిచ్చా సుదీప్ నేడు బీజేపీలో చేర‌నున్న విషయాలు తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం కిచ్చా సుదీప్ కు రెండు బెదిరింపు లేఖ‌లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ప‌బ్లిక్ చేస్తామ‌ని అస‌భ్య ప‌దాల‌తో కూడిన వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఆ బెదిరింపు లేఖ‌ పై సుదీప్ మేనేజ‌ర్ జాక్ మంజు పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ లేఖ‌లు ఎవ‌రు పంపార‌నే కోణంలో పోలీసులు విచార‌ణ చేపట్టారు. కర్ణాటకలో వరుసగా రెండోసారి కూడా కాషాయ కండువాను ఎగరవేయాలని చూస్తున్న బీజేపీ ఈసారి స్టార్ క్యాంపెయినర్లుగా సినీ స్టార్లను రంగంలోకి దించుతోంది. వారిలో కిచ్చా సుదీప్ కూడా ఒకరు. స్టార్ నటుడు అయినా కిచ్చా సుదీప్ కు కర్ణాటకలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే.

 

కర్ణాటక లో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. దీంతో నాయక సామాజిక వర్గానికి చెందిన సుదీప్ వ‌ల్ల బీజేపీకి క‌లిసి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకుంది. ఇకపోతే కిచ్చా సుదీప్ సినిమాల విషయానికి వస్తే.. సుదీప్ జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.. సినిమాతో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్నారు. కాగా నేడు బెంగళూరులోని ఒక ప్రైవేటు హోటల్‌లో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఇతర ముఖ్య‌ నేతల సమక్షంలో ఆయ‌న పార్టీలో చేరబోతున్న‌ట్లు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -