Power Star: మరో రీమేక్ కు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. అవసరమా బాస్!

Power Star: కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ స్ట్రైట్ సినిమాలతో పోలిస్తే రీమేక్లపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. అతడి గత సినిమాలు వకీల్ సాబ్ భీమ్లా నాయక్ రీమేక్ మూవీస్ కావటం గమనార్హం అలాగే రాబోయే సినిమాలో వస్తాది భగత్ సింగ్ కూడా రీమేకే. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రో మూవీ కూడా తమిళ సినిమా రీమేక్ అని తెలిసిందే. ఇందులో టైం పాత్రలో కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఆయన గోపాల గోపాల సినిమాలో దేవుడి పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక దేవుడు పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లుగా సినీవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇంతకీ విషయం ఏమిటంటే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఓ మై గాడ్ మూవీ ని తెలుగులో రీమేక్ చేస్తే అందులో విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించి గా ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ లో హిట్ అయినట్టుగా తెలుగులో హిట్ కొట్టలేకపోయింది గోపాల గోపాల సినిమా.

 

అలాగే రీసెంట్ గా విడుదలైన బ్రో సినిమా కూడా ఒరిజినల్ లో హిట్ అయినంతగా తెలుగులో హిట్ అవ్వలేదని ఇప్పటికే టాక్ వచ్చేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఏం పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడట. అదే ఓ మై గాడ్ టు మూవీ రీమేక్. ఇందులో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో కనిపిస్తాడు.

 

అయితే ఓ మై గాడ్ ఫస్ట్ పార్ట్ లో గోవిందుడి పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్ సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి శివుని పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సినిమా కనుక హిట్ అయితే పవన్ కళ్యాణ్ మరొక దేవుడు పాత్రలో మన ముందుకి వస్తాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -