Debts: ఏపీలో అప్పుల శాతం ఏకంగా ఈ రేంజ్ లో పెరిగిందా?

Debts: గడిచిన నాలుగేళ్లలో ఏపీలో ఏం జరిగింది అంటే రాజకీయం అని చెప్పవచ్చు. అదే తెలంగాణలో ఏం జరిగింది అంటే అభివృద్ధి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అభివృద్ధి విషయం పక్కనపెడితే అప్పులు చేసుకుంటూ పోయింది. ఆ అప్పులు తారా స్థాయికి చేరుకున్నాయి. కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత ఏడాది మార్చి 31నాటికి ఏపీ ఆర్ధిక పరిస్థితి, రెవెన్యూ, రవాణా తదితర రంగాల పరిస్థితులపై నివేదికను సమర్పించింది. ఏపీ ప్రభుత్వం మరింత ఎక్కువ రుణాలు తీసుకొనేందుకు వీలుగా 2021-2022లో ఏపీ ఎఫ్ఆర్‌బీఎం చట్టాన్ని సవరించుకొంది.

బడ్జెట్‌లో పేర్కొనని రుణాలు రూ.1,18,394 కోట్లు అని పేర్కొంది. ఇక డిస్కమ్‌లకు చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు, సాగునీటి ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు కలిపి మొత్తం రూ.17,804 కోట్లు అని తెలిపింది. 2021 2022 నాటికి ఏపీ అప్పులు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయి. అందులో 90 శాతం అప్పులకు 13.99% వడ్డీ చెల్లిస్తోంది. గడచిన 5 ఏళ్లలో తలసరి రుణం 71 శాతం పెరిగింది. బడ్జెట్లో చూపని రుణాలను కూడా కలుపుకొంటే రాష్ట్రంలో ఒక్కో పౌరుడిపై రూ.92,797 భారం పడుతుంది.

 

అలాగే వైఎస్సార్ గృహవసతి పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ళు లేదా స్థలాల కోసం చేసిన రూ.688 కోట్ల ఖర్చును రెవెన్యూ వ్యయంగా చూపించాల్సి ఉండగా మూలధన వ్యయంగా తప్పుగా చూపించింది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే, గత రెండేళ్ళలో రాష్ట్రంలో పెట్టుబడులు 150 శాతం వృద్ధి చెందాయి. 7 లక్షల ఐ‌టి ఉద్యోగాలు వచ్చినట్లు ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఛైర్మన్ డిఎస్.రావత్ తాజా నివేదికలో వెల్లడించారు.

 

2020-2021లో రాష్ట్రానికి రూ.31,274 కోట్లు పెట్టుబడులు రాగా, 2021-2022లో రూ.76,568 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా తెలంగాణలో కొత్తగా మరో 60,000 ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ దూసుకుపోయింది. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో అంటే 2014-15లో తెలంగాణ ఐ‌టి ఎగుమతుల విలువ రూ.66,276 కోట్లు కాగా, అవి 2021-2022 నాటికి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. దాంతో ఐ‌టి తదితర రంగాలలో కొత్తగా 3.71 లక్షల ఉద్యోగాలు పెరిగాయి.

 

కాగా వేరు వేరు నివేదికలను చూసినప్పుడు మొత్తంగా ఏపీ అంటే అప్పులు తెలంగాణ అంటే అభివృద్ధి అని అర్థమవుతుంది. అంతేకాకుండా హైదరాబాదులో గడిచిన 5 – 6 ఏళ్లలో 17 ఫ్లైఓవర్లను నిర్మించింది. ఈ విషయానికి వస్తే.. విశాఖను రాజధాని చేస్తామని చెపుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో విశాఖనగరంలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్‌ కూడా నిర్మించలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో హైదరాబాద్‌లో మెట్రో కారిడార్‌ను నగరం నలువైపులా విస్తరించుకొంటూపోతుంటే, ఏపీ ప్రభుత్వం విశాఖలో మెట్రోకి ప్రతిపాదనలు కూడా పంపలేదని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -