Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి ఓటు హక్కు దూరం చేస్తుంది అనే వాదన వినపడుతుంది. లక్షలు ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరు కాబోతున్నారు.

ఇలా ఎన్నికల విధులకు హాజరు కాబోయే ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఈనెల 22వ తేదీ వరకు మాత్రమే ఉంది అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ వేయాలి అంటే ఫారం 12 ఇచ్చారు. ఉద్యోగులు వివిధ కారణాలతో తాము పని చేస్తున్న చోట కాకుండా ఇతర చోట ఓటు హక్కు కలిగి ఉంటారు. అయినప్పటికీ చాలా మంది తమ ఫాం 12 తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారులకు ఇస్తూంటే.. ఎవరు కూడా పోస్టల్ బ్యాలెట్స్ తీసుకోవడం లేదు.

తమకు కాదంటే తనకు కాదు అంటూ ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఎవరు కూడా తీసుకోవడం లేదు దీంతో ఉద్యోగులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఈసీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ గడువులోపు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్స్ కనుక తీసుకోకపోతే సుమారు లక్షల 30 వేల మంది ఉద్యోగులు ఓట్లు కోల్పోయినట్లేనని తెలుస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా లక్ష 30 వేల మంది ఉద్యోగులను ఎన్నికల విధులకు నియమించారు. అయితే ఇలా పోస్టల్ బ్యాలెట్స్ తీసుకోకపోవడం వెనక వైసిపి నేతలు ఉన్నారని తెలుస్తోంది.వైసీపీకి సన్నిహితంగా ఉండే ఆర్వోలు ఈ కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యపై ఇంకా స్పందించలేదు. స్పందించకపోతే లక్షల మంది ఉపయోగించుకునే పోస్టల్ బ్యాలెట్లు నిరుపయోగంగా మారిపోతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -