Rajnath Singh: ఏపీలో పొత్తులు ఉంటాయంటూ కేంద్ర మంత్రి సంకేతాలు.. పార్టీకి తిరుగులేదంటూ?

Rajnath Singh: ఏపీలో పొత్తుల వ్యవహారం ఇంకా తేలలేదు. అమిత్ షా పిలుపుతో ఢిల్లీ వెళ్లన చంద్రబాబు దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, పొత్తులపై చర్చలు సానుకూలంగానే సాగినట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా కూడా.. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. దీంతో.. ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. అమిత్ షా ఆ కామెంట్స్ చేసిన తర్వాత అటు టీడీపీ నుంచి కానీ.. ఇటు బీజేపీ నుంచి కానీ పొత్తు ప్రస్తావన రాలేదు. అలాగని పొత్తు ఉండదు అనే సంకేతాలు కూడా కనిపించలేదు.

దీంతో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ తో ఉత్కంఠ నెలకొంది. పైగా టీడీపీ, జనసేన తొలి జాబితా కూడా విడుదల చేసింది. టీడీపీ 94 స్థానాలు, జనసేన 5 స్థానాలను ప్రకటించింది. ఇక జనసేనకు 24 సీట్లను చంద్రబాబు ఫిక్స్ చేశారు. టికెట్ల విషయంలో బాగా వెనబడి ఉందని వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు ఏకంగా 94 స్థానాలను ప్రకటించి ఆ విమర్శలకు కల్లెం వేశారు. కానీ, బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. 175 స్థానాలకు గాను.. జనసేనకు ప్రకటించిన 24 స్థానాలను కలుపుకుంటే మొత్తం 118 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇంకా.. 57 స్థానాలు ప్రకటించాల్సింది కనుక పొత్తు లేదని కొట్టిపారేయలం. అంటే.. ఇంకా పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. రోజులు గడిచే కొద్ది ఈ సస్పెన్స్ పెరుగుతూనే పోతుంది. ఈ లోపు ఎవరికి నచ్చిన విశ్లేషణలు వాళ్లు చేస్తున్నారు. బీజేపీ 10 ఎంపీ స్థానాలు అడుగుతోందని.. అయితే చంద్రబాబు దానికి అంగీకరించడం లేదని ఇలా ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. అయితే, ఏపీలో పర్యటించిన రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్‌తో ఏపీలో పొత్తుపై కొంత సందిగ్ధత వీడింది.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి నేరుగా వచ్చి అక్కడ మేథావుల సదస్సులో పాలు పంచుకున్నారు. అక్కడ నుంచి విజయవాడ వెళ్లి అక్కడ పార్టీ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏలూరులో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇలా వరుస మీటింగులతో రాజ్‌నాథ్ సింగ్ బిజీ బిజీగా గడిపారు. అయితే, విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు ఎన్నికలపై దిశానిర్ధేశం చేశారు. ఏపీలో పొత్తులపై రాష్ట్రనేతలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. పొత్తులతోనే ఈసారి ఎన్నికలకు వెళ్తామని అన్నారు.

అంతేకాదు.. అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చారు. అమరావతే ఏపీ రాజధాని అని గతంలో బీజేపీ తీర్మానం చేసిన విషయాన్ని కూడా ఆయన పార్టీ నేతలకు గుర్తు చేశారు. అంటే.. వచ్చే ఎన్నికలు.. ఏపీ రాజధాని అంశంపైనే జరుగుతాయని ఆయన చెప్పకనే చెప్పారు. అదే సమయంలో.. రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు టీడీపీతో పొత్తు అంశాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. బీజేపీలో రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి వారు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు తొలి నుంచి ఆసక్తిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ పొత్తులపై పాజిటివ్ గా కామెంట్స్ చేయడంతో పొత్తు ఖాయమని తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -