Pawan: పవన్ సినిమా డిజాస్టర్ కావడం వల్లే ఈ దర్శకుడు నష్టపోయాడా?

Pawan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలుఉన్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో తీన్మార్ ఖాన్ సినిమా కూడా ఒకటి. హిందీ హిట్ ల‌వ్ ఆజ్ క‌ల్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో మంచి ఫీల్ ఉన్న ల‌వ్ సీన్స్ ఉన్నాయి. రెండు పాత్ర‌ల్లో ప‌వ‌న్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్నారు.

ఇక డైలాగ్స్ కూడా సూప‌ర్ అనే చెప్పాలి. త్రివిక్ర‌మ్ సహాయంతో ఈ సినిమాను అందంగా తీశాడు జ‌యంత్ సి.ప‌రాన్జీ. కానీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఆశించిన ప‌లితాన్ని అందుకోలేక‌పోయింది. ఒక మోస్తారు వ‌సూళ్ల‌తో ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. కానీ త‌ర్వాత టీవీల్లో, డిజిట‌ల్ ఫ్లాట్‌ ఫామ్స్‌లో ఈ సినిమాకు మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అని చాలామంది ఆశ్చ‌ర్య‌పోతుంటారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజే ఈ సినిమాకు మైన‌స్ అయిందంటున్నాడు ద‌ర్శ‌కుడు జ‌యంత్.
తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో తీన్‌మార్ ఫెయిల్యూర్ గురించి జ‌యంత్ మాట్లాడుతూ…

 

ఈ సినిమా గురించి ప‌వ‌న్ అభిమానులు త‌ర్వాతి కాలంలో ఇచ్చిన ఫీడ్ బ్యాక్ త‌న‌కు షాకిచ్చింద‌ని జ‌యంత్ తెలిపాడు. ప‌వ‌న్ ప్రేమించిన అమ్మాయి వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవ‌డం.. తిరిగి త‌న ద‌గ్గ‌రికి రావ‌డం త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని ఫ్యాన్స్ చెప్పిన‌ట్లు జ‌యంత్ వెల్ల‌డించాడు. అభిమానులు ఇలా ఆలోచిస్తార‌ని అనుకోలేదు,దీన్ని బ‌ట్టి ప‌వ‌న్ ఇమేజే సినిమాకు ప్ర‌తిబంధ‌కంగా మారింద‌ని అర్థ‌మైన‌ట్లు జ‌యంత్ తెలిపాడు. ప‌వ‌న్ ఎంతో న‌చ్చి చేసిన సినిమా ఇది అని ఆయ‌న‌ తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -