Balayya: బాలయ్య గట్స్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే.. ఆ దర్శకునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారా?

Balayya: బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలు లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తున్నాయా.. ఉండే ఉంటాయండి. ఎందుకంటే అవి మరిచిపోయే సినిమాలు కాదు. బాలయ్య కెరియర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన సినిమాలు. ఈ సినిమాలన్నింటినీ డైరెక్ట్ చేసిన దర్శకుడు బి. గోపాల్. వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

మళ్లీ వాళ్ల కాంబినేషన్ కోసం ఎప్పటినుంచో ఇటు బాలయ్య ఫ్యాన్స్ అటు సినీ వర్గాల వారు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చేసింది. నిజమేనండి బాలయ్య బాబు, బి గోపాల్ డైరెక్షన్లో చేయటానికి ఒప్పుకున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు ఏ కథను లాక్ చేయలేదని త్వరలోనే కథ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు డైరెక్టర్ బి గోపాల్. అన్ స్టాపబుల్ , అఖండ సినిమాతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య తన కెరీర్ లోనే మంచి హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

 

అలాగే తన రెమ్యూనరేషన్ కూడా ఒకసారిగా పెంచేశారు. ఇప్పటివరకు ఐదు నుంచి 6 కోట్లు తీసుకుని బాలయ్య ఇప్పుడు ఏకంగా 20 కోట్లని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఆఖండ ఇచ్చిన విజయంతో అంత డబ్బు ఇవ్వటానికి బాలయ్య ఇంటి చుట్టూ క్యూలు కడుతున్నారు దర్శకులు ప్రొడ్యూసర్లు. అలాంటి స్టేజీలో ఉన్న బాలయ్య ఫామ్ లో లేని దర్శకుడు బి.గోపాల్ కి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాడంటే నిజంగా బాలయ్య గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

అయితే బాలయ్య ఈ ప్రాజెక్టు యాక్సెప్ట్ చేయటానికి గల కారణం ఆ ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధం. బి గోపాల్ ఎప్పటినుంచో ఒక మంచి సినిమాతో తన కెరియర్ ని అండ్ చేయాలని చూస్తున్నారు అదే విషయాన్ని బాలయ్యతో చెప్పటంతో ఆయన కూడా ఓకే చెప్పటంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్లే కనిపిస్తుంది.మొత్తానికి దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని బాలయ్య బాబు తన మంచితనాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -