Prajapalana: ప్రజాపాలన స్కీమ్ కు దరఖాస్తు చేశారా.. వివరాలు ఎలా చెక్ చేయాలంటే?

Prajapalana: గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ సర్కార్ ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించింది. అర్హులైన వారి నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి ఏకంగా కోటిపైగా అప్లికేషన్లు స్వీకరించారు అధికారులు. వీటి డేటా మొత్తాన్ని కంప్యూటరీకరణ చేస్తున్నారు. పండగ సెలవుల సందర్భంగా పని కాస్త ఆగినప్పటికీ త్వరలోనే డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తి కావస్తుందని తెలిసింది. ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించి https.//prajapalana.telangana.gov.in/ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ను ఇప్పటికే ప్రారంభించింది.

 

తెలంగాణ సర్కార్ ఇందులో పూర్తి డేటాను నిక్షిప్తం చేసేలా కసరత్తు చేస్తుంది దరఖాస్తుదారుడి స్టేటస్ కూడా తెలుసుకొనే వెసులుబాటును కల్పించనుంది. అయితే ఇందులో భాగంగా వెబ్సైట్ కీలక ఆప్షన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్. ప్రజా పాలన పోర్టల్ లో దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు know your application status అనే ఆప్షన్ తీసుకొచ్చింది దీనిపై క్లిక్ చేయగానే అప్లికేషన్ నెంబర్ అని కనిపిస్తుంది.

దీంట్లో దరఖాస్తుదారుడి అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసి కింద captcha ను పూర్తి చేయాలి. ఆ తర్వాత view status అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనే విషయం డిస్ప్లే అవుతుంది అయితే డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత పూర్తిస్థాయిలో ఈ వెబ్సైటు అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

 

ప్రస్తుతం ఈ వెబ్సైట్లో ఉన్న లోటుపాట్లను గమనిస్తున్నారు. ఈ వెబ్సైట్లో దరఖాస్తుదారుడు ఏ స్కీంకు అర్హత సాధించారు లేదంటే ఏమైనా అప్లికేషన్లో తప్పులు ఉన్నాయా ఇంకా ఏమైనా వివరాలను సమర్పించాల్సి ఉంటుందా అనే అంశాలు కూడా మనకి తెలిసే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది మళ్లీ నాలుగు నెలల తరువాత దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -