Vizag: పనిలో చేర్చుకుంటే ఓనర్ భార్యతో అలా చేశాడు.. ఆ తర్వాత

Vizag: ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య అధికమవుతుంది. ఇలా ఎంతోమంది అక్రమ సంబంధాల కారణంగా హత్యకు గురికాగా మరికొందరు నేరస్తులుగా మిగిలిపోతున్నారు.ప్రస్తుత కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. పనిలో ఆసరాగా ఉంటారని చేరదీసిన వ్యక్తి తన భార్యపై కన్నేయడంతో ఆ వ్యక్తిని చంపిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది.

విశాఖ జిల్లా గాజువాకకు చెందిన గౌరీ సాయి అనే వ్యక్తి గుర్రాలను పెంచుకుంటున్నారు. ఆర్కే బీచ్ కి వచ్చే పర్యాటకులను డబ్బులు తీసుకొని గుర్రం మీద తిప్పుతూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈయన ఒక కేసులో భాగంగా జైలుకు వెళ్లాల్సి రావడంతో తన గుర్రాలను చూసుకోవడానికి ఆసరాగా రిక్కి జగదీశ్వరరావు అలియాస్ శివ అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నారు.ఇలా గౌరీ సాయి జైలుకు వెళ్ళగా శివ గుర్రాలను చూసుకోవడమే కాకుండా అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను గౌరీ సాయి భార్యతో మాట్లాడేవారు.

 

ఇలా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇక గౌరి సాయి జైలు నుంచి బయటకు రాగా శివకువచ్చిన మంచి పేరును చూసి ఆశ్చర్యపోయారు. అలాగే తన కదలికలపై కూడా కన్నేసి పెట్టారు. దీంతో శివ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని గుర్తించిన గౌరీ సాయి పథకం ప్రకారం తనని తన స్నేహితుల సహాయంతో చినకొవ్వాడ సమీపంలోని రొయ్యల చెరువుల వద్దకు మద్యం, గంజాయి తీసుకున్న తర్వాత అంతా కలిసి బీచ్ ఒడ్డు ఉన్న సరుగుడు తోటలోకి తీసుకెళ్లి ముందుగానే తీసి ఉన్న గోతిలోకి పడేసే రాతితో కొట్టి చంపి పూడ్చి పెట్టారు.

 

ఈ ఘటన ఈ నెల నాలుగవ తేదీ జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇక తన కుమారుడు కనిపించలేదని శివ తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో నిందితులను గుర్తించిన పోలీసులు నిజం రాబట్టి శవాన్ని వెలికి తీసి తిరిగి పోస్ట్ మార్టం పంపించారు. అయితే ఈ హత్య కేసులో నిందితుడితోపాటు మరో పది మంది ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -