Health Benefits: అరటిపండు తిని తొక్క పడేస్తున్నారా.. ఇది తెలిస్తే ఎవ్వరు పడెయ్యరు?

Health Benefits: సాధారణంగా మనం ఎన్నో రకాలైన పండ్లను తింటూ వాటి తొక్కలను పడేస్తుంటాము. అయితే కొన్ని రకాల పండ్లు తొక్కలలో కూడా ఎన్నో పోషక విలువలు ఉండడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మనకు అన్ని కాలాలలో పుష్కలంగా లభించే వాటిలో అరటిపండు ఒకటి. అరటిపండ్లు ప్రతి ఒక్కరి ఇంటిలో ఎప్పుడు లభిస్తూ ఉంటాయి.

ఏదైనా శుభకార్యం జరిగిన ఇతర పూజా కార్యక్రమాలలో అరటి పండ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అయితే మనం అరటిపండు తినాలంటే తోలు మొత్తం పడేసి లోపల ఉన్నటువంటి పండు మాత్రమే తింటాము కానీ అరటిపండు తొక్కలను పడేయడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను కోల్పోతాము.అరటిపండు తొక్కను ఉపయోగించి ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

సాధారణంగా మన ఇంటి ఆవరణంలో పెంచుకున్నటువంటి మొక్కలకు సరైన పోషకాలు కావాలంటే ఎరువులను ఉపయోగించాల్సిన పనిలేదు మనం తిని పడేసిన అరటిపండు తొక్కలను రెండు రోజులపాటు నీటిలో నానబెట్టి ఆ నీటిని చెట్లకు పోయడం వల్ల అరటి తొక్కలో ఉన్నటువంటి పోషకాలు నీటిలోకి వచ్చి అవి మొక్కలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇక మీ వంట గదిలో బాగా చిలుము పట్టిన బానిలి, పెనాలు, దీపపు ప్రమిదలు వంటి వాటివి ఉంటే ముందుగా ఈ అరటి తొక్కతో వాటిని 15 నిమిషాల పాటు బాగా రుద్దాలి. అనంతరం డిష్ వాష్ లిక్విడ్ తో వాటిని శుభ్రం చేయడం వల్ల అవన్నీ కొత్త వాటిలా మిల మిలా మెరుస్తాయి. అదేవిధంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు అరటిపండు తొక్కను ఓ 15 నిమిషాలు పాటు డీ ఫ్రిజ్లో పెట్టి అనంతరం తలపై వేసుకోవడం వల్ల క్షణాల్లో తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఫేస్ ప్యాక్ గా ఈ అరటి పండ్లను ఉపయోగించడం వల్ల మొహం కూడా ఎంతో నిగనిగలాడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -