Garlic: వెల్లుల్లి ఎవరెవరు తినకూడదో తెలుసా?

Garlic: వంటింట్లో దొరికి వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. ఘటైన వాసన రుచి కలిగిన వెల్లుల్లి కూరలకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటినుంచో ఆయుర్వేదం లో వ్యాధులను నయం చేయడం కోసం వెల్లుల్లి ఉపయోగిస్తున్నారు. కీళ్ల నొప్పులకు వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ పొరపాటున కూడా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తినకూడదు.

మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారికి వెల్లుల్లి మంచిది కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎసిడిటీ.. ఈ సమస్య అధికంగా ఉంటే వెల్లుల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. వెల్లుల్లికి పూర్తి దూరం పాటించాలి. ఎందుకంటే స్వభావరీత్యా వెల్లుల్లిలో ఎసిడిటీ గుణాలు ఉన్నందున ఆ సమస్య ఉన్నవాళ్లు తింటే ఛాతీలో మంట పుడుతుంది. కాబట్టి ఎసిడిటీ సమస్య ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండడం మంచిది. చెమట వాసన.. చాలామందికి చెమటలో దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు వెల్లుల్లి తింటే ఆ సమస్య మరింత పెరుగుతుంది.

 

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్ అనేది ఎక్కువసేపు నోటి నుంచి దుర్వాసనకు కారణమౌతుంది. అటువంటప్పుడు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అలాగే గుండె మంట..
వెల్లుల్లి రోజూ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. దాంతో గుండెలో మంట, కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. సర్జరీ..ఏదైనా సర్జరీ చేయించుకుని ఉంటే వెల్లుల్లికి దూరంగా ఉండాలి. వెల్లుల్లి వల్ల సర్జరీ గాయంపై ప్రభావం పడుతుంది. సర్జరీకు 2-3 వారాల ముందే వెల్లుల్లి తినకూడదు. లేదంటే సర్జరీ వికటించే ప్రమాదం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -