Health Tips: ఉదయాన్నే పాలు తాగుతున్నారా.. అయితే ఈ పనులు అసలు చేయకండి?

Health Tips: పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. చాలామంది పాలను తాగడానికి ఇష్టపడరు. పాలకు బదులుగా కాఫీ టీ బూస్ట్ లాంటివి తాగుతూ ఉంటారు. అయితే మనలో చాలామందికి ఉదయాన్నే పాలు తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది రాత్రిళ్ళు సమయంలో నిద్ర పోయే ముందు కూడా పాలు తాగుతూ ఉంటారు. పాలను తాగడం వల్ల పాలలో ఉండే క్యాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అయితే పాలన తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ పాలన తీసుకునేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. కాచిన పాలకు బదులుగా పచ్చిపాలు తాగడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు.

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో పెద్దపెద్ద నగరాలలో ఎక్కువగా ప్యాకెట్ పాలే ఎక్కువ లభిస్తూ ఉంటాయి. కానీ పల్లెటూరు గ్రామాలలో చాలామంది గేదలు ఆవుల నుంచి అప్పుడే ఫ్రెష్ గా పితికిన పాలను తాగుతూ ఉంటారు. ఇంకొందరు వాటిని కాచి చల్లారబెట్టుకుని తాగుతూ ఉంటారు. అయితే పచ్చిపాలను తాగడం అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పచ్చిపాలలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఉండే పాలను తాగడం వల్ల కీళ్ల వాపు డయేరియా డిహైడ్రేషన్ అంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీళ్లు అలాగే పదార్థాలను కలుపుతారు. కాబట్టి పితికినప్పుడు అక్కడి వాతావరణం బట్టి అందులో కొన్ని మలినాలు కూడా కలుస్తాయి. అటువంటి పాలను తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

అలాగే వేడి చేయని అపరిశుభ్రమైన పాలు తాగితే ట్యుబర్కులోసిస్ అనే ప్రమాదకర జబ్బు వచ్చే అవకాశముంది. బ్యాక్టీరియా వల్ల ఊపరితితులపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. బ్యాక్టీరియా ఉండడం వల్ల పచ్చి పాలు త్వరగా పాడవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు పచ్చి పాలను తీసుకోవద్దు. బాగా మరగబెట్టిన తర్వాత మాత్రమే పాలని తీసుకోవాలి. పచ్చి పాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. శరీరంలో యాసిడ్ పెరిగతే ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అందుకే పచ్చిపాలు తాగకపోవడమే శ్రేయస్కరం.

 

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -