TV Actress: ఈ బుల్లితెర నటి కష్టాలు వింటే మాత్రం షాకవ్వాల్సిందే!

TV Actress: సాధారణంగా సినిమా సెలబ్రిటీల జీవితాలు తెరపై చాలా అందంగా ప్రశాంతంగా ఉన్నట్టు కనపడతాయి కానీ తెర వెనుక మాత్రం అందరి జీవితాలలో మాదిరిగా వారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉంటాయి. ఇలా ఎంతో మంది సెలెబ్రెటీలు వారి జీవిత భాగస్వామిల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ నరకం అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా అలాంటి నరకం అనుభవిస్తున్నానని తమిళ బుల్లితెర నటి శాలిని వెల్లడించారు.

తాజాగా ఈమె తన భర్తతో విడాకులు జరిగాయని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఏకంగా విడాకులకు ఫోటోషూట్ చేయించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా విడాకుల ఫోటోషూట్ ద్వారా ఒక్కసారిగా శాలిని వార్తల్లో నిలిచారు.తన భర్త ఫోటోలను చింపేస్తూ ఈమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈమె పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలపై తాజాగా షాలిని స్పందిస్తూ తన భర్త పెట్టే టార్చర్ గురించి వెల్లడించారు.

 

అందరూ అనుకున్నట్టు తన భర్త మంచివాడు కాదని తనని చాలా టార్చర్ పెట్టేవాడని తెలియజేశారు. ప్రతిరోజు తనపై చేయి చేసుకునే వాడని ఆయన కొట్టిన ప్రతిసారి తాను పార్కింగ్ ప్లేస్ లో వెళ్లి పడుకునేదాన్ని తెలిపారు.ఆయన నాతో గొడవ పడిన ప్రతిసారి ఆ గొడవ పెద్దది కాకుండా చూస్తాను అంతేకాకుండా ఆయన పెట్టే టార్చర్ భరించలేక పోలీసులను ఆశ్రయించిన తను ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో పోలీసులను కూడా ఆశ్రయించలేదని శాలిని తెలిపారు.

 

కూతురు ముందు కూడా తనని కొట్టేవారని అయితే అది చూసి తన కూతురు భయపడి ఏడ్చిన తను మాత్రం కొట్టేది ఆపేవాడు కాదని తెలిపారు.ఇలా తన టార్చర్ భరించలేక తాను విడాకులు తీసుకున్నానని నా కూతురికి ఇలాంటి ఒక శాడిస్ట్ తండ్రి అవసరం లేదు అంటూ ఈ సందర్భంగా ఈమెతన భర్త చేతిలో పడిన ఇబ్బందుల గురించి అలాగే తాను విడాకులు తీసుకోవడానికి గల కారణాలను గురించి బయట పెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -