Shriya: హీరోయిన్ శ్రియ షాకింగ్ కామెంట్లు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Shriya: టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ శ్రియ శరన్. తన నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కులు సంపాదించుకుంది. తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఇక శ్రియ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది. ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అలా వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది. మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా తనకు ఒక పాప కూడా పుట్టింది.

 

ఇక ఆ మధ్యనే మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సహాయక పాత్రలలో చేస్తుంది శ్రియ. ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కబ్జా అనే సినిమాలో నటించగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషలలో వచ్చేనెల 17న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినీ బృందం ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉండగా.. శ్రియ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

 

కోలీవుడ్ ఇండస్ట్రీ తనకు మంచి సినిమాలలో నటించే అవకాశం కల్పించింది అని.. మరిన్ని తమిళ సినిమాలలో నటించాలన్నది తన కోరిక అని తెలిపింది. ఇక దర్శకుడు శంకర్ దగ్గర పనిచేసే ఛాన్స్ దక్కిందని అన్నది. పెళ్లి తర్వాత బిడ్డకు జన్మనివ్వడం, కరోనా కారణంగా కొంత గ్యాప్ వచ్చిందని.. ఇప్పుడు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తన లక్ష్యమని తెలిపింది. ఇక చేసే సినిమాలలో తన బోల్డ్, హాట్, న్యూడ్ పాత్రలు చూసి తన కూతురు ఇబ్బందిగా ఫీల్ కాకూడదు అని.. తన సినిమాలు చూసిన తర్వాత తన కుమార్తె గర్వించాలి అని షాకింగ్ కామెంట్ చేసింది. ఇక ఈ కామెంట్లు విని ఆశ్చర్యపోక తప్పదని అనాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -