Nandamuri Balakrishna: భారీ అంచనాలతో డిజాస్టర్ గా మారిన బాలయ్య సినిమాలు ఏవో తెలుసా?

Nandamuri Balakrishna: టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు సినిమాలు అన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించక పూర్తిగా డిజాస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు మనం ఆ సినిమా వివరాలు తెలుసుకుందాం.

అప్పట్లో బాలకృష్ణ జననీ జన్మభూమి సినిమా లో బాలకృష్ణ, సుమలత, రాజ్యలక్ష్మి, కైకాల సత్యనారాయణ, శారధ, పి జె సర్మ లు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాకి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ గా మిగిలింది.

అదేవిధంగా బాలకృష్ణ కత్తుల కొండయ్య.. ఈ సినిమాలో సుమలత హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమాకి ఎస్బి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా కూడా అప్పట్లో పూర్తిగా డిజాస్టర్ గా మిగిలింది.

ఇక అల్లరి కృష్ణయ్య బాలకృష్ణ, భానుప్రియ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు అంచనాలు బాగానే వేశారు. కాగా ఈ సినిమాకు దర్శకత్వం నందమూరి రమేష్ వహించాడు. ఇక ఈ సినిమా కూడా బాలకృష్ణకు అంత విజయం సాధించి పెట్టలేకపోయింది.

సాహస సామ్రాట్.. బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూశారు. ఈ సినిమాకు కె రాఘవేంద్ర దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా కూడా బాలకృష్ణకు విజయం సాధించి పెట్టలేకపోయింది.

ప్రాణానికి ప్రాణం అనే ఈ సినిమాకు చలసాని రామారావు దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కూడా అప్పట్లో పూర్తిగా డిజాస్టర్ గా మిగిలింది. 1990 జనవరి 12న సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -