బాలీవుడ్ లో అత్యధిక నెట్ కలెక్షన్లను రాబట్టిన సౌత్ సినిమాలు ఇవే?

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు హిందీ సినిమాలు రాజ్యమేలేవి అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా నుంచి దక్షిణాది సినీ పరిశ్రమలో తెరకెక్కి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమా అనంతరం తదుపరి వచ్చిన బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్, పుష్ప, కేజిఎఫ్, కేజిఎఫ్ 2, మేజర్ RRR, కార్తికేయ 2వంటి సినిమాలు హిందీలో కూడా విడుదలయ్యే కలెక్షన్ల సునామి సృష్టించాయి.ఈ విధంగా సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికల పడిపోయాయి. బాలీవుడ్ అగ్ర హీరోలైన అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ రణబీర్ కపూర్ వంటి హీరోలు నటించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడం అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం వరుసగా ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో తెరికెక్కిన సినిమాలు బాలీవుడ్ లో విడుదల అయ్యి ఈ ఏడాది అత్యధికంగా నెట్ కలెక్షన్ సాధించిన సినిమాలు ఏంటి? ఏ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టాయి అనే విషయానికి వస్తే…

కేజిఎఫ్ రూ. 434.7 కోట్లు, త్రిబుల్ ఆర్ – రూ. 274.31 కోట్లు, ప్రభాస్ రాధే శ్యామ్ – రూ. 19.30 కోట్లు, నిఖిల్ కార్తికేయ 2– రూ. 16.30 కోట్లు(ఇంకా నడుస్తోంది) అడివి శేష్ మేజర్– రూ. 12.71 కోట్లు, సుదీప్ కిచ్చ – రూ. 12 కోట్లు, కమల్ హాసన్ విక్రమ్ – రూ. 6.64 కోట్లు, రక్షిత శెట్టి 777 చార్లీ – రూ. 6.55 కోట్లు, విజయ్ బీస్ట్ రూ. 2.30 కోట్లు, అజిత్ వలిమై – రూ. 2.10కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టాయని తెలుస్తుంది ఇక పోను పోను సౌత్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే సినిమాలు గా ప్రేక్షకుల ముందుకు వస్తాయనటంలో సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -