Movies: 2 నెలలు.. 4 సినిమాలు.. ఈ సినిమాలలో చరిత్ర సృష్టించే సినిమా ఏది అంటూ?

Movies: సంవత్సరం ముగింపు కి వచ్చేసాం , సినిమా పండుగ అయిపోయింది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇప్పుడే అసలు పండుగ ప్రారంభం కాబోతుంది. వచ్చే రెండు నెలలు రాబోయే నాలుగు సినిమాలు కూడా చాలా హై బడ్జెట్ మూవీలు, అలాగే కోట్ల రూపాయల వసూలు చేసే సత్తా గల సినిమాలు ఆ సినిమాలు ఏమిటో మీకు ఈపాటికి అర్థం అయి ఉంటాయి అవి టైగర్ 3, సాలార్, యానిమల్, డుంకీ.

ఈ నాలుగు సినిమాలు పోటా,పోటీగా సంవత్సరం ఆఖరున వస్తున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల సత్తా ఎలా ఉందో చూద్దాం. ముందుగా టైగర్ త్రీ సినిమా విషయానికి వస్తే ట్రైలర్ ఇప్పటికే పెద్ద హిట్ అయింది. సల్మాన్ ఖాన్ సినిమా క్లిక్ అయితే రెండు రోజులకే 100 కోట్ల వసూళ్లు అలఓకగా వచ్చేస్తాయి. పైగా ఇప్పుడు బాలీవుడ్ లో యాక్షన్ మూవీ సీజన్ నడుస్తుంది. ఇక మన డార్లింగ్ యంగ్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ కూడా ఈ పోటీలో ఉంది.

ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావటం, మన ప్రభాస్ హీరో కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ కి ఈ సినిమా గేమ్ చేజర్ మూవీ కాబోతుంది. ఏమాత్రం బాగున్నా సినిమాని ఓ రేంజ్ కి తీసుకువెళ్లి పోతారు అభిమానులు. ఇక ఈ పోటీలో ఉన్న షారుక్ మూవీ డుంకి. షారుక్ ఖాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు అతని నుంచి వస్తున్న సినిమా ఇది పైగా రాజ్ కుమార్ హిరాని దర్శకుడు.

కాబట్టి ఏ మాత్రం క్లిక్ అయినా ఈ సినిమా థియేటర్లలో సునామి సృష్టిస్తుంది. మరో మూవీ యానిమల్ మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హీరో రణబీర్ కపూర్ తో తీస్తున్న సినిమా. ఈ ఇద్దరు సంచలనాలు సృష్టించగలిగిన వాళ్లే. ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాల పోటీ మాట ఎలా ఉన్నా ప్రేక్షకులకు మాత్రం పండగ ఒక నెల ముందే వస్తుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -