Netflix: నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్న క్రేజీ సినిమాల జాబితా ఇదే?

Netflix: ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ వినోదాన్ని అందించడానికి సిద్ధమైంది. స్టార్ హీరోల చిత్రాలతో పాటు యంగ్‌ హీరోల సినిమాలను వరుసగా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు #NetflixPandaga పేరుతో పోస్టర్లు విడుదల చేసింది. ఆయా చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యాక ఓటీటీలోకి రానున్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదల కాబోతున్న ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే..

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబరు 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపిన నెట్‌ఫ్లిక్స్‌ డేట్‌ను ఇంకా ఖరారు చేయలేదు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ కానుంది. దేవర పార్ట్‌ 1 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. పార్ట్ వన్ సంచలన విజయం సాధించడంతోపాటు పార్ట్ 2 పై అదే రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది.

 

విశ్వక్‌సేన్‌,నేహాశెట్టి జంటగా కృష్ణ చైతన్య రూపొందిస్తున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఓటీటీలోకి రానుంది.

 

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుంది. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఓటీటీలో సందడి చేయనుంది.

 

విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌ లో సందడి చేయనుంది. అలాగే బాలయ్య బాబు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా విడుదల కానుంది. అల్లు శిరీష్‌ ప్రధాన పాత్రలో సామ్‌ ఆంటోన్‌ తెరకెక్కిస్తున్న బడ్డీ సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇందులో కొన్ని సినిమాలు చిత్రీకరణను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా మరికొన్ని ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాదిలోపే విడుదల కానున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -