This Week Movies: మొదటి రోజే షోలు క్యాన్సిల్.. శుక్రవారం రోజున రిలీజైన ఈ సినిమాల పరిస్థితి ఇంత దారుణమా?

This Week Movies: మామూలుగా సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాకు వచ్చే పబ్లిక్ టాక్ ఆ సినిమా కలెక్షన్లపై ఆ సినిమాను థియేటర్లలో ఉంచాలని లేదా అన్న విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది అన్న విషయం తెలిసిందే. సినిమా విడుదలైన తర్వాత బయట టాక్ ని బట్టి కూడా సినిమా థియేటర్లకు రావాలా వద్దా అని ఆలోచించుకునే ప్రేక్షకులు కూడా ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు థియేటర్స్ లో ఒకేసారి నాలుగైదు అంతకంటే ఎక్కువ సినిమాలు కూడా విడుదల అవుతూ ఉంటాయి. కానీ బోలెడు కొత్త చిత్రాలు రిలీజై మొదటి రోజు స్క్రీన్లు తక్కువ పడితే అంతకంటే పండగేమనుకుంటాం.

కానీ వాటిలో ఒక్క దానికి మినహాయించి మిగిలినవాటికి హౌస్ ఫుల్స్ కావడం పక్కనపెడితే అసలు మధ్యాన్నం, రాత్రి ఆటలు క్యాన్సిల్ కావడమంటే ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామమే. తాజాగా అనగా నిన్న విడుదలైన వాటిలో ఒక్క మ్యాడ్ మాత్రమే ప్రేక్షకులతో పాస్ ముద్ర వేయించుకుని వసూళ్లు రాబడుతోంది. ఆ సినిమాతో పాటు విడుదల అయినా మిగిలిన సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భాషతో సంబంధం లేకుండా మిగిలినవాటి బాక్సాఫీస్ సీన్ దయనీయంగా ఉంది. కలర్స్ స్వాతి మంత్ అఫ్ మధు, సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, మురళీధరన్ 800, సిద్దార్థ్ చిన్నాలకు నగరాల్లో కొన్ని మల్టీప్లెక్సులు మినహాయించి చాలా చోట్ల షోకు కనీసం ఒక పాతిక మంది రాలేని పరిస్థితి నెలకొంది.

కొన్ని బిసి సెంటర్లలో మార్నింగ్ షోలే రద్దు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని చోట్ల ఆల్రెడీ తీసేసిన జవాన్ సినిమాని మళ్ళీ వేసి ఫైనల్ రన్ వైపు వెళ్తున్న స్కందని తిరిగి కంటిన్యూ చేస్తున్నారు. ఒక నెల మొదటి వారంలో ఇలా జరగడం అనూహ్యం. దాంతో పరిస్థితులను చూసి దెబ్బకు బయ్యర్లు బెంబేలెత్తుతున్నారు. దసరాకు భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావులు వచ్చే దాకా ఇందులో ఎలాంటి మార్పు ఉండదని, అద్దెలు గిట్టుబాటు అయితే చాలానే రీతిలో ఎగ్జిబిటర్లు రోజు దేవుడిని వేడుకోవడం మినహా ఏం చేయలేమని అంటున్నారు. హైదరాబాద్, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో కొంత మెరుగ్గా ఉన్నా మాస్ ప్రభావం ఎక్కువగా ఉండే కేంద్రాల్లో మాత్రం టికెట్ కౌంటర్లు డల్లుగా ఉన్నాయి. ఇతర బాషల మిషన్ రాణిగంజ్, దోనో, ఎగ్జార్సిస్ట్ బిలీవర్ లు కూడా అంతంతమాత్రమే జనాన్ని రప్పిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -