YSRCP Leaders: వైసీపీ ఓడిపోతుందని ముందే అర్థమైపోయిందా.. ఆ నేతలు అందుకే గుడ్ బై చెప్పారా?

YSRCP Leaders: గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కాలం దగ్గర పడిందని తెలుస్తోంది అందుకే వచ్చే ఎన్నికలలో ఎలాగో తమ ప్రభుత్వం ఓడిపోతుందని భావించినటువంటి పలువురు సీనియర్ వైసీపీ నాయకులు ఈ పార్టీకి పూర్తిస్థాయిలో గుడ్ బై చెప్పబోతున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుకొని అనంతపురం వరకు ఎంతో మంది వైసీపీ సీనియర్ నేతలు పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్తున్నారు.

ఇక వీరందరూ కూడా ఇటీవల ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్లు కూడా కావటం విశేషం కొందరు సీట్లు పార్టీ మారుతూ ఉండగా మరికొందరు జగన్ వ్యవహార శైలి నచ్చక పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర‌మాజీ మంత్రి కిల్లి కృపారాణి , ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజాలు వైసీపీని వీడారు.

అనంత‌పురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, శింగ‌న‌మ‌ల మాజీ ఎమ్మెల్యే యామిని బాల‌ కూడా వైసిపికి దూరమయ్యారు. ఇలా వైసిపి నుంచి బయటకు వెళ్లినటువంటి వారందరూ కూడా ఎంతో సీనియర్ నాయకులు కావడం అలాగే వైసిపిలో కీలకపాత్ర పోషించిన వారు కావటం విశేషం ఇలా కీలక నాయకులు వైసిపికి దూరం కావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైసిపికి దూరమవుతున్నారు.

వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ ఎలాగో గెలవదని గ్రహించినటువంటి ఈ సీనియర్ నాయకులందరూ కూడా ముందస్తు జాగ్రత్తతో పార్టీని వదిలి సైకిల్ చెంతకు చేరారు. ఇలా సొంత పార్టీ నాయకులై ఈ స్థాయిలో వలసలు వెళ్తున్నారు అంటే జగన్ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పాలన అందింది సొంత పార్టీ నేతలే ఆయన పాలన పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -