Hero Suriya: హీరో సూర్య మొదటి శాలరీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Hero Suriya: తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరో సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. సూర్య చేసిన ‘గజిని’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో కూడా సూర్య సినిమా మంచి కలెక్షన్లను రాబడుతుంది. అందుకే సూర్య సినిమా చేసేటప్పుడే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేస్తుంటారు.

తమిళంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వెళ్లిన హీరోల జాబితాలో సూర్య కూడా ఉన్నాడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబ నుండి వచ్చినా కానీ ఎంతో కష్టపడే ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. గతంలో తాను సినిమాల్లోకి రాకముందు, ఒక ఫ్యాక్టరీలో పని చేసినట్లు తాజాగా సూర్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక గార్మెంట్ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసినట్లు సూర్య తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అప్పట్లో తాను రోజుకు 18గంటల పాటు ఫ్యాక్టరీలో పని చేసే వాడినని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు మొదటి జీతం కింద రూ.736లు వచ్చిందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

కాగా సూర్య తెలుగులో చేసిన గజిని, సూర్య s/o కృష్ణన్, సింగం, యముడు, వీడొక్కడే, రక్తచరిత్ర, సెవన్త్ సెన్స్, 24, బందోబస్త్, ఆకాశం హద్దురా, జైభీమ్ సినిమాలు మంచి ఆదరణను పొందాయి. భార్య జ్యోతిక నిర్మాణ సారథ్యంలో చేసిన ‘జైభీమ్’ సినిమాకు క్రిటిక్స్ నుండి మంచి మార్కులు రావడం, పలు అవార్డులు కూడా రావడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -