Surya S/O Krishnan: తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ లో సూర్య సన్నాఫ్ కృష్ణన్ రికార్డ్.. ఆ రేంజ్ కలెక్షన్లా?

Surya S/O Krishnan: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి మనందరికీ తెలిసిందే. సూర్య కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సూర్య నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ లోకి కూడా విడుదల అయినా విషయం తెలిసిందే. కాగా సూర్యకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గ‌తంలో హిట్ అయిన సినిమాల‌నే కాదు.

 

ప్లాప్ అయిన సినిమాల‌ను కూడా తిరిగి ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ సినిమాల‌కు వ‌సూళ్లు దుమ్ము రేపుతున్నాయి. ఖుషి లాంటి సినిమాల‌కు ఏకంగా రు. 7-8 కోట్లు కూడా వ‌చ్చాయి. ఆరెంజ్ లాంటి ప్లాప్ సినిమాకు కూడా రు. 5 కోట్లు వరకు కలెక్షన్స్ వ‌చ్చాయి. ఇక సూర్య అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం న‌టించిన సినిమా సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కాగా ఈ సినిమాకు మ‌న తెలుగు ఆడియెన్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందించారు. అయితే ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లో ఈ సినిమా సెన్షేష‌న‌ల్ రికార్డు సెట్ చేసుకుంది. మొదటి రోజుకే ఒక కోటి గ్రాస్ అందుకున్న సినిమాల లిస్టులో సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ చేర‌డం నిజంగా గ్రేటే.

ఒక కోలీవుడ్ హీరో ప్లాప్ సినిమా అది కూడా రిలీజ్ అయ్యాక 15 ఏళ్ల‌కు ఇప్పుడు ఇక్క‌డ రీ రిలీజ్ చేస్తే ఫ‌స్ట్ డే కోటి గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. నిన్న ఒక్కరోజు లోనే 24 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది అప్ప‌ట్లోనే క‌ల్ట్ క్లాసిక్ సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఈ సినిమాకు హ‌రీష్ జైరాజ్ ఆల్బ‌మ్ అప్ప‌ట్లో సెన్షేష‌న్ అని చెప్ప‌క్క‌ర్లేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -