Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Uday Kiran: టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్ గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఉదయ్ కిరణ్ ఎక్కువగా లవ్ సినిమాలలో నటించి యూత్ లో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ కావడంతో భారీగా క్రేజ్ ఏర్పడింది. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. కానీ అతి చిన్న వయసులోనే ఎవరు ఊహించని విధంగా మరణించిన విషయం తెలిసిందే. మొదట చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్ కిరణ్.

ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయారు. కాగా ఉదయ్ కిరణ్ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ప‌నిచేస్తున్న విషితను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ త‌ర‌వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అప్పట్లో సినిమా అవకాశాలు రాను రాను తగ్గుముఖం పట్టడంతో పాటు పాటు ఫ్యామిలీ కారణాల వల్ల కూడా ఉదయ్ కిరణ్ మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఫ్యాన్ ని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. విషిత ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణం త‌ర‌వాత అత‌డి కుటుంబానికి పూర్తిగా దూరం అయ్యింది.

13 రోజుల త‌ర‌వాత విషిత ఉదయ్ ఫ్యామిలీకి దూరంగా ఉండ‌టం మొద‌లు పెట్టింద‌ని ఉద‌య్ కిర‌ణ్ సోద‌రి శ్రీదేవి ఒక ఇంట‌ర్య్వూలో తెలిపారు. అంతేకాకుండా ప్ర‌స్తుతం విషిత ఓ ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజ‌నీర్ గా ఉద్యోగం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదివ‌ర‌కు ఉద‌య్ కిర‌ణ్ తో క‌లిసి హైద‌రాబాద్ లో ఉన్న విషిత భ‌ర్త మ‌ర‌ణం త‌ర‌వాత ముంబైకి వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. కాగా అప్పట్లో ఉదయ్ కిరణ్ మరణం పట్ల అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -