Kalyan Dev: నెట్టింట్లో మరోసారి అలాంటివి ట్వీట్ చేసిన కళ్యాణ్ దేవ్?

Kalyan Dev: మెగా డాటర్ శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల పేర్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ దేవ్, శ్రీజ విడివిడిగా ఉండటంతో వాళ్లు విడాకులు తీసుకుంటున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ విషయంపై ఇటు శ్రీజ కాని అటు కళ్యాణ్ దేవ్ కానీ స్పందించడం లేదు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. మెగా ఫ్యామిలీలో శ్రీజ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్లు జరిగినా కూడా కళ్యాణ్ దేవ్ హాజరు కావడం లేదు. దీనితో వారిద్దరి విషయంలో వస్తున్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది.

ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ దేవ్ శ్రీజ ఒకరిని ఉద్దేశిస్తూ ఒకరు ఇన్ డైరెక్టుగా చేస్తున్న పోస్టులను బట్టి చూస్తుంటే ఇప్పటికే వీరు విడాకులు తీసుకొని విడిపోయినట్టు తెలుస్తోంది. కాగా వీరు పరోక్షంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీకి పిల్లలకు దూరంగా ఉంటున్న కళ్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్ ని కూడా చేశారు కళ్యాణ్. ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు కళ్యాణ్ దేవ్.

 

ఎప్పటికీ మార్చలేని విషయాలను వదిలేసే ధైర్యం వచ్చినప్పుడు, ఆ క్షణాలు చాలా ఆనందమయం, నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అని రాసుకొచ్చాడు. అయితే కళ్యాణ్ దేవ్ ఇది శ్రీజని ఉద్దేశించే చేశాడని పలువురు నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ పై అభిమానులు, సన్నిహితులు స్పందిస్తూ అతనికి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజెన్ అనూహ్యంగా.. ఏం జరిగిన ధైర్యంగా ఉండండి. ఉదయ్ కిరణ్ లాగా చేయకండి, అంటూ కామెంట్ చేశాడు. ఉదయ్ కిరణ్ మరణానికి మెగా ఫ్యామిలీ పరోక్షంగా కారణమనే వాదన ఎప్పటి నుండో ఉంది. ఆ ఉద్దేశంతోనే సదరు నెటిజెన్ ఆ విధంగా స్పందించాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -