Chiranjeevi: చిరంజీవి పెద్ద కూతురు ఉదయ్ వెనుక ఇంత కథ నడిచిందా?

Chiranjeevi: ఒకప్పటి హ్యాట్రిక్ హీరో, అమ్మాయిల కలల రాకుమారుడు ఉదయ్ కిరణ్ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఎందుకంటే జూన్ 26 ఆ హ్యాట్రిక్ హీరో పుట్టినరోజు. హ్యాట్రిక్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా, అసంపూర్తిగా ముగిసిపోవడం అందరికీ బాధ కలిగించింది.

 

ఉదయ్ పుట్టినరోజు సందర్భంగా ఒక జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ జీవితం గురించి మాట్లాడటంతో మళ్లీ పాత విషయాలన్నీ బయటికి వచ్చాయి అవి ఏంటో చూద్దాం. ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి నువ్వు నేను తో ఊహించని సక్సెస్ ని అందుకున్నాడు. ఎంతగా అంటే చిరంజీవి తన ఇంటి అల్లుడిని చేసుకోవాలి అనే అంత.

అందుకే ఇంద్ర విజయోత్సవ సభలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉదయ్ కిరణ్ ని నిలబెట్టాడు చిరంజీవి. అప్పటికే ఊహించని విజయం, చిరంజీవి ఇంటి అల్లుడు కాబోటం ఇవన్నీ ఉదయ్ కిరణ్ ని ఉక్కిరి బిక్కిరి చేసేసాయి. కానీ నిశ్చితార్థం వరకు వెళ్లిన వాళ్ల బంధం పెళ్ళి వరకు వెళ్లలేదు. అందుకు కారణం ఉదయ్ కిరణ్ ఒక సినీ జర్నలిస్ట్ తో ప్రేమలో పడినట్లుగా అప్పట్లో చెప్పుకొచ్చింది మెగా కాంపౌండ్.

 

కేవలం ఆ ఒక్క కారణం వల్లే సుష్మిత ఉదయ్ కిరణ్ ల పెళ్లి క్యాన్సిల్ అయిందా అంటే కాదు అది కేవలం ఒక నాకు మాత్రమే దీని వెనుక పెద్ద రాజకీయమే జరిగింది అని అప్పట్లో టాలీవుడ్ కోడై కూసింది. నెమ్మదిగా ఉదయ్ కిరణ్ సినీ ప్రస్థానం కూడా మెల్ల మెల్లగా దిగజారిపోయింది. డబుల్ ఫాలోయింగ్ తట్టుకోలేని ఉదయ్ కిరణ్ మెంటల్ స్ట్రెస్ కి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 

అయితే సుష్మిత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె కూడా చాలా సంవత్సరాల నుంచి తండ్రి వద్దే ఉంటుంది. వీరిద్దరి మధ్య ఇంత కథ నడిచింది అని సీనియర్ జర్నలిస్ట్ తన ఇంటర్వ్యూలో చెప్పుకు రావటం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -