Uday Kiran: ఉదయ్ జీవితాన్ని నాశనం చేసింది ఆ ప్రేమ మాత్రమేనా?

Uday Kiran: ఉదయ్ కిరణ్ జీవితం ఒక ఎగసి పడిన అల. ఎంత నువ్వే తిను పైకి లేచాడో అంతే తొందరగా పాతాళానికి పడిపోయాడు. ఒకప్పటి కలల రాకుమారుడు జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవటానికి కారణం ఏమిటి..

జూన్ 26 అతని పుట్టినరోజు సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ తను ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చూద్దాం రండి. ఉదయ్ కిరణ్ అప్పట్లో హ్యాట్రిక్ హీరో. అమ్మాయిల కలల రాకుమారుడు మాత్రమే కాదు టాలీవుడ్ ఫ్యూచర్ హోప్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని పేరు గడించాడు.

మొదటి సినిమా చిత్రంతోనే ఒక గొప్ప విజయాన్ని అందుకొని రెండవ సినిమా నువ్వు నేను తో వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది ఉదయ్ కిరణ్ ఇమేజ్. ఆ ఇమేజ్ ఎంతవరకు వెళ్లిందంటే మెగాస్టార్ చిరంజీవి సైతం అతనిని అల్లుడుగా చేసుకోవాలి అనేంతవరకు వెళ్ళింది. అందుకే విజయవాడలో జరిపిన ఇంద్ర విజయోత్సవ సభకి ఉదయ్ కిరణ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా కూడా నిలబెట్టాడు చిరంజీవి.

ఉదయ్ కిరణ్ కూడా చిన్ననాటి నుంచి చిరంజీవి డాన్సులు చూసి అతని ఇన్స్పిరేషన్తోనే సినిమాల్లోకి వచ్చానని చెప్పుకునేవాడు. అయితే చిరంజీవి ఉదయ్ కిరణ్ ని తన పెద్ద కుమార్తె సుష్మితకి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని నిశ్చితార్థం కూడా జరిపించాడు. అయితే ఆ నిశ్చితార్థం పెళ్ళి వరకు వెళ్లలేదు.

 

నిశ్చితార్థం తర్వాత ఉదయ్ కిరణ్ ఒక జర్నలిస్టులతో ప్రేమలో ఉన్నట్టు, సుస్మిత తో పెళ్లి కోసం ఆమెని సైడ్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ గొడవల్లో పడిన ఉదయ్ కిరణ్ కెరియర్ కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. అటు కెరియర్ లోను ఇటు లైఫ్ లోను పాతాళానికి పడిపోయాడు ఉదయ్ కిరణ్.

అయితే ఉదయ్ కిరణ్ జీవితం నాశనం కావడానికి ప్రేమ మాత్రమే కారణం కాదు దీని వెనుక మెగాస్టార్ ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. ఏదైతేనేమి సినీ రాజకీయాలని అర్థం చేసుకోలేని ఒక నిండుతార నేల రాలిపోయింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -