Amala Paul: వైరల్ అవుతున్న హీరోయిన్ అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు!

Amala Paul: అమలాపాల్.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంది అమలాపాల్. ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల ద్వారానే హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఇకపోతే ఏడాది ఈమె రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్‌లో జగత్‌ దేశాయ్‌ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా ఇటీవలే తాను ప్రెగ్నెన్సీ అన్న శుభవార్తని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

 

అప్పటి నుంచి తరచుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఇటీవలె బేబీ బంప్ తో బీచ్ లో ఫోటోలు దిగి అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన అమలాపాల్ తాజాగా తన భర్తతో కలిసి. మరోసారి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు షేర్ చేస్తూ కాస్తా ఫన్నీగా కామెంట్స్ చేసింది ముద్దుగుమ్మ. ఈ మేరకు ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ సమయంలో ఒక పురుషుడి పొట్ట దాదాపు అతని భార్య గర్భంతో సమానంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

అలాంటి అపోహలను తొలగించే సరైన సమయం ఇదే. ఇప్పుడు కేవలం నేను మాత్రమే గర్భవతి కాదు. మేమిద్దరం. సారీ మై హస్బెండ్‌ అంటూ ఫన్నీ ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా చేసిన కామెంట్స్ పై ఫన్నీగా స్పందిస్తున్నారు. కాగా తమిళంలో మైన చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్‌, విజయ్‌, ధనుష్‌ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. ‌తమిళం, తెలుగులోనూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -