Roja Ramya Krishna: రోజా ఇంట్లో హీరోయిన్ రమ్యకృష్ణ.. రోజా ప్రేమకు ఫిదా కావాల్సిందే!

Roja Ramya Krishna: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిమనులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రోజా రమ్యకృష్ణ వంటి వారు ఒకరు.ఈ ఇద్దరు హీరోయిన్లు ఒకానొక సమయంలో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వారి వృత్తిపరమైన జీవితాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ రమ్యకృష్ణ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా రోజా మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో వీరిద్దరూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రమ్యకృష్ణ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

 

స్వామివారి దర్శనం అనంతరం ఈమె తన స్నేహితురాలు సినీనటి రోజా ఇంటికి వెళ్లారు. రోజా రమ్యకృష్ణను ఎంతో సాదరంగం ఆహ్వానించారు. అనంతరం రమ్యకృష్ణ రోజా పలు విషయాల గురించి సరదాగా మాట్లాడుతూ వారి అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకున్నారు. ఇక రోజా రమ్యకృష్ణ కోసం ప్రత్యేకంగా విందు కూడా ఏర్పాటు చేశారు. ఇలా రోజా ఇంట్లో అందరూ కలిసి విందు భోజనం ఏర్పాటు చేసిన అనంతరం రమ్యకృష్ణ తిరుగు ప్రయాణం అయ్యారు.

 

ఇక రమ్యకృష్ణ రోజా ఇంటి నుంచి వెళ్లే సమయంలో సాంప్రదాయబద్ధంగా రోజా రమ్యకృష్ణ కోసం చీర సారె పెట్టి తనని సాగనంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను రోజా ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రోజా షేర్ చేసిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు సమ్మక్క సారక్క ఇద్దరు ఒకే చోట కలిశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి సమ్మక్క సారక్క సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -