Samantha: సమంత సంపాదన మొత్తం పోయిందా.. అప్పులే మిగిలాయా?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సమంత. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. బాలీవుడ్‌కు మకాం మార్చుకుంది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంది. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే సమంత ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సమంత అప్పుల్లో కూరుకుపోయిందా? అంటే అవుననే చెబుతున్నారు సినీ ప్రముఖులు. రూ.కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునే సమంత ఒక్కసారిగా అప్పుడే అప్పుల్లో ఎలా కూరుకుపోయిందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నా.. దానికి తగ్గట్లే ఖర్చు కూడా చేసేదట. ఒక సామెత మీకు తెలిసే ఉంటుంది. తింటే కొండైన కరగక తప్పదని. ఈ క్రమంలో సమంత అప్పుల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో సమంత తన తదుపరి సినిమాల్లో నటించడానికి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇన్నేళ్లపాటు సంపాదించిన సంపాదనను ఏం చేసిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి సమంత సంపాదనలో సగం తన మేకప్ ఖర్చులకే పెట్టేదట. పెళ్లికి ముందు ఎలా ఉన్న పెళ్లి తర్వాత సమంత ఖర్చులు పెరిగాయి. తన సొంత ఖర్చులు, అడిగిన వాళ్లకు సహాయం చేయడం వల్ల బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు ఖాళీ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నారు. వాస్తవానికి సమంత-నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు సమంత మేకప్ ఖర్చులు, టూర్ ఖర్చులన్నీ అక్కినేని ఫ్యామిలీనే భరించేది. కానీ విడాకులు తీసుకున్న తర్వాత సమంత టూర్లకు వెళ్తూ వచ్చింది. దీంతో ఎక్కడికి వెళ్లినా.. ఏ బిజినెస్ చేయాలనుకున్న సొంత డబ్బులే ఖర్చు చేయాలి. అలాగే సమంత అందరినీ గుడ్డిగా నమ్మి డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అప్పుల పాలైనట్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -