Heroine: ఈ హీరోయిన్ల వ్యాధుల వెనుక అసలు కారణాలివే!

Heroine: ఒకప్పుడు హీరోయిన్లకు తమ నటనతోనే పేరు ప్రఖ్యాతలు వచ్చేవి. ఆ కాలంలో వెండితెరపై ఆడవాళ్లు ముందుకు వచ్చి నటించడమే మహా గొప్ప. కాలం మారింది. నటీమణులు మారారు. అప్పట్లో లావుగా ఉన్నా.. ఆ హీరోయిన్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. అందానికి పెద్దగా వ్యాల్యూ లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్నీ ఇంపార్టెంటే. అందం నుంచి బాడీ షేపింగ్ వరకు ప్రతిదీ పర్‌ఫెక్ట్ గా ఉండాలని ఈ కాలం నటీమణులు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి సినిమా రంగంలో రాణించాలనుకునే నటీమణులకు అందమైన రూపం, శరీర ఆకృతి ఎంతో అవసరం. ఒకప్పుడు శరీర ఆకృతి, రూపాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం పర్‌ఫెక్ట్ ఫిగర్ కోసం హీరోయిన్‌లు ఎంతో శ్రమిస్తుంటారు. ఏ పార్టు ఎంత సైజులో ఉండాలో.. అంతే ఉండేలా.. జీరో సైజ్ ఫిగర్‌ను మెయిన్‌టేన్ చేయడానికి రకరకాల వ్యాయామాలు, డైట్లు ఫాలొ అవుతుంటారు. అలా ఫాలొ అవ్వడం వల్ల చాలా మంది హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే అందరూ ఒకే రకమైన వ్యాధుల బారిన పడకుండా.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన డిసీజ్‌తో బాధపడుతున్నారు.

 

నిజానికి పుట్టినప్పటి నుంచి పెరిగేంతవరకు ఎవరికీ పర్‌ఫెక్ట్ ఫిగర్ ఉండదు. అందుకోసం హీరోయిన్లు వ్యాయామం, యోగా, డైట్లు, వెయిట్ లిఫ్టింగ్ వంటి పనులు చేస్తుంటారు. అయితే వీరు తీసుకునే డైట్ కూడా ఘన పదార్థాల రూపంలో కాకుండా లిక్విడ్ రూపంలో తీసుకుంటారు. లిక్విడ్ రూపంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన కొన్ని ప్రోటీన్లు మాత్రమే అందుతాయి. కేవలం శక్తి మాత్రమే వస్తుందని, పూర్తి స్థాయిలో శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు అందవని వైద్య నిపుణులు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు లావుగా కనిపించొద్దని ఎక్కువ శాతం తమ డైట్‌ను లిక్విడ్ రూపంలోనే తీసుకుంటున్నారు. అదే డైట్‌ను అలవాటుగా మార్చుకుంటున్నారు. కడుపు నిండా తినకుండా.. ఎంత కష్టమైనా భరిస్తూ డైట్ కొనసాగిస్తున్నారు. భారీగా వెయిట్ లిఫ్టింగ్, హెవీ వర్కౌట్స్ చేస్తుంటారు. అవసరానికి మించి వ్యాయామం చేయడం వల్ల శరీరంపై భారీగా ప్రభావం పడుతోంది. ఈ క్రమంతో వారంతా అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇలాంటి వ్యాధి బారినే పడింది. ఈ కారణాల వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -