Heroines: తల్లి అయ్యే విషయంలో రికార్డ్ లు సృష్టించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

Heroines: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు తల్లి కాబోతున్న సమయంలో పెళ్లి చేసుకుంటున్నారు. అదే విధంగా కొంతమంది తల్లి అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది పెళ్లయిన కొన్ని నెలల వ్యవధిలోనే పిల్లలను కంటున్నారు.

అయితే ఈ తరహాలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కి సంబంధించిన చాలామంది హీరో హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటిగా కమల్ హాసన్, సారిక.. పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకున్నారు. ముందుగా కమల్ హాసన్ గారికి ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కూడా ఇదేవిధంగా ఒక కొడుకు పుట్టాక పెళ్లి చేసుకున్నారు. మొదటిగా వీళ్ళు ప్రేమించుకుని.. లివింగ్ రిలేషన్ లో ఉండి.. ఆ తర్వాత రేణు దేశాయ్ ఒక మగ బిడ్డకు జన్మనిచ్చాక వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

ఇక అదే విధంగా నిండు గర్భవతిగా ప్రముఖ హీరోయిన్ నేహా దుపియా పెళ్లి పీటలు ఎక్కింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సడన్ గా పెళ్లి చేసుకుని అందరికీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత అంతే సడన్ గా తల్లిదండ్రులు కాబోతున్నారని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.

అయితే వాళ్లు పెళ్లి చేసుకున్న నెలలోనే ప్రెగ్నెన్సీ గురించి చెప్పడంతో అందరూ అనుమానపడ్డారు. అయితే వీళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాకే పెళ్లి చేసుకున్నారని జనాలందరూ అనుకున్నారు. అలియా భట్ కు ఉన్న నెలల ప్రకారం అంచనా వేసి అలియా భట్ పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయిందని గ్రహించారు.

ఇక ఇటీవల సెన్సేషనల్ జోడిగా పేరుపొందిన నయనతార, విఘ్నేష్ శివన్ కూడా పెళ్లికి ముందు నుంచే పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నారట. పెళ్లయిన నాలుగు నెలలకే వీళ్ళు తల్లిదండ్రులు అయినట్టు వీరికి కవల పిల్లలు పుట్టినట్టు తెలియజేశారు.

అయితే ఎక్కడ చూసిన కూడా నయనతార కడుపుతో కనిపించలేదు. వరుసగా సినిమా షూటింగ్ లు చేసింది. ఏ సినిమాలో కూడా ఆమెకు కడుపు కనిపించకపోవడంతో ఇది ఎలా సాధ్యమని అందరూ అనుకున్నారు. అయితే పెళ్లికి ముందు నుంచే వీళ్ళు సరోగసి ద్వారా పిల్లలను కణాలని నిర్ణయించుకున్నారట.

పెళ్లికి ముందే పిల్లల్ని ఎలా కనాలో ప్లాన్ చేసుకున్న దంపతులు..

ఇక పెళ్లయిన నాలుగు నెలలకు వీరికి కవల పిల్లలు జన్మించారు. నయనతారకు ఏదో గర్భ సమస్య ఉండడంతో వీరు ముందు నుంచి దీన్ని ప్లాన్ చేసుకొని సరోగసి పద్ధతిని సంప్రదించారట. ఇలా ప్రతి హీరోయిన్ లో తమ వ్యక్తిగత విషయాలను తమ ఇష్ట ప్రకారమే చేసుకుంటూ పోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -