AP: స్థలాలే చూపించని ఇళ్లను ఎలా నిర్మించుకోవాలి.. ఏపీ ప్రజల కష్టాలివే!

AP: వింతవింత సమస్యలన్నీ ఏపీ ప్రజలకే వస్తాయి. కనిపించని భూమికి రిజిస్ట్రేషన్ అంట. అవును కోనసీమ జిల్లాలో కొందరికి ఇదే సమస్య ఎందురైంది. అధికారులు వచ్చి మీపేరు మీద కొన్ని స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తామని స్థానికులకు చెబుతున్నారు. కానీ, ఆ స్థలాలు ఎక్కడున్నాయంటే చూపించడం లేదు. కాగితాల మీద చూపిస్తున్నారు తప్పా.. నేలపై చూపించడం లేదు.

 

జగనన్న కాలనీల కోసం ప్రభుత్వం లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అలాగే.. కోనసీమ జిల్లా అమలాపురం మండలంలోని కామనగరువులో కూడా 200 వందల మంది లబ్దిదారులకు పంపిణీ చేసింది. దీనికోసం 6 ఎకరాల భూమిని ప్రవేట్ వ్యక్తుల దగ్గర రెండున్నర కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ భూమిలోనే జగనన్న కాలనీల లబ్దిదారుల కోసం ఇళ్ల నిర్మాణానికి కేటాయించింది. దానికి సంబందించిన పట్టాలను పేదలకు పంపిణీ చేశారు. అయితే, అందులో తమ ప్లాటు ఎక్కడ ఉందని అడిగితే ప్రభుత్వ అధికారులు కానీ, స్థానిక నేతలు కానీ గట్టిగా చెప్పలేని పరిస్థితి. కనిపించని భూమికి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు అదే పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తామని వారిని సచివాలయానికి లబ్ధిదారులను పిలుస్తున్నారు. అయితే.. మొదట తమ ప్లాటు ఎక్కడుందో చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దానికి తెలివిగా మీ పట్టా పుస్తకంలో ప్లాటు నెంబర్ ఉంది కాదా అని చెబుతున్నారు. తీరా ప్రభుత్వం కొన్న స్థలం దగ్గరకు వెళ్లి చూస్తే… కనీసం మంటి పోసి చదును చేసేసిన దాఖలాలు కూడా లేవు. అలాంటి భూమిలో ప్లాట్లు, దాని నెంబర్లు అంటే ఏమని అర్థం చేసుకోవాలో తెలియక లబ్దిదారులు తలలు పట్టుకుంటున్నారు. ఇవాళ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే.. రేపు లబ్ది దారులు ఆ స్థలాల కోసం కొట్టుకొని చావాలి. ఎవరి స్థలాలు వారికి కేటాయించలేదు కనుక.. ఎవరికి నచ్చిన దగ్గరు వాళ్లు పునాదులు వేసుకొని అవకాశం లేకపోలేదు. అప్పుడు లబ్ధిదారుల మధ్య గొడవలు అవ్వక తప్పదు. అందుకే.. వారు కూడా తమ స్థలం ఎక్కడ నుంచి ఎక్కడ వరకో చెబతే.. అప్పుడు రిజిస్ట్రేషన్ కు వస్తామని చెబుతున్నారు.

 

అసలే సర్వర్లు మొరాయించి రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో సర్వర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి టైంలో దేనికి ఉపయోగపడని పనులు ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం వచ్చిన తర్వాత కనీసం వారానికి ఒకసారి అయినా.. సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, సర్వర్లపై ఒత్తిడి తగ్గించాలి. రిజిస్ట్రేషన్లు సవ్యంగా జరిగితే… భూములు కొనేవాళ్లు, అమ్మేవాళ్ల హ్యాపీగా వ్యాపారులు చేసుకుంటారు. ప్రభుత్వానికి కూడా ఆధాయం వస్తుంది. బయటకు కనిపించని స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయడం వలన ఎవరకీ ప్రయోజనం లేదు.

 

ఇళ్ల పట్టాల విషయంలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వడం, నిర్మాణాలకు పనికిరాని స్థలాలను జగనన్న కాలనీల కోసం కేటాయిచడం లాంటి నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు.. రాజధాని కోసం సేకరించిన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలు మొదలు పెట్టారు. చంద్రబాబు తలచిన అమరావతి రాజధానిగా ఉండకుండా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయం కోర్టులు కూడా పలు సార్లు మొట్టికాయలు వేశాయి. కానీ, జగన్ సర్కార్ తీరు మారటం లేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -