Uma Maheswara Rao: దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉంది.. వైసీపీపై బోండా ఉమ విమర్శలు మామూలుగా లేవుగా!

Uma Maheswara Rao: వైసీపీ ఒక్కో నియోజవర్గంలో ఒక్కో స్ట్రాటజీ. కొన్ని స్థానాల్లో వాలంటీర్ల వాడకం, మరికొన్ని నియోజవర్గాల్లో దొంగ ఓట్లు, ఇంకొన్ని నియోజవర్గాల్లో అభ్యర్థులు మార్పు.. ఇలా ఏం చేసినా వర్క్ అవ్వకపోతే.. ప్రతిపక్షనేతలపై బురదచల్లడం. ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే, వైసీపీ అమలు చేస్తున్న ఏ వ్యూహం కూడా ఫలించడం లేదు. అన్నీ బూమ్ రాంగ్ అవుతున్నాయి. విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున మల్లాది విష్ణు పోటీ చేశారు. ఆ ఎన్నికల్ల వైసీపీ ప్రభజనంలో కూడా టీడీపీ అభ్యర్థి బోండా ఉమా కేవలం 25 ఓట్లతోనే ఓడిపోయారు. మరి.. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం పక్కన పెడితే.. ఎదురుగాలి వీస్తుంది. దీంతో.. బోండా ఉమా గెలుపు పక్కా అని సర్వేలు చెబుతున్నాయి. అందుకే జగన్ అభ్యర్థిని మార్చి వెల్లంపల్లిని రంగంలోకి దించారు. అయినా వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడం లేదు. పైగా మల్లాది విష్ణు అధిష్టానంపై అలకబూనారు. ఆ మధ్య పార్టీ కూడా మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, అందుకే ఆయన ఎంతవరకూ వెల్లంపల్లికి సహకరిస్తారో చెప్పలేం. కాబట్టి బోండా ఉమా గెలుపును ఆపే వ్యూహాలను వైసీపీ రచిస్తూనే ఉంది.

అందులో భాగంగా బోండా ఉమాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ హయాంలో బోండా ఉమా భూ కబ్జాలు చేశారని.. రౌడీయిజం చేయించారని వైసీపీ ప్రచారం చేస్తోంది. విజయవాడ సెంట్రల్ 2014 నుంచి 2019 వరకూ గూండాయిజానికి అడ్డా మారిందని జోరుగా ప్రచారం చేస్తోంది. అయితే, బోండా ఉమా దానికి గట్టిగా కౌంటర్ వేశారు. దొంగల పడిన ఆరు మాసాలకు కుక్కలు మొరిగినట్టు ఉందని అన్నారు. 2019 పోయి.. 2024 వచ్చింది.. ఈ ఐదేళ్లు వైసీపీ నేతలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ ఐదేళ్లు నియోజవర్గంలో తాను ఎమ్మెల్యేగా లేనని.. చంద్రబాబు సీఎం కారని గుర్తు చేశారు. అంతేకాదు.. టీడీపీ అధికారంలో లేదు.. కాబట్టి ఇన్నాళ్లు తనపై ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. ఎవరైనా తనపై ఆరోపణలు చేస్తున్నారో వాళ్లే అధికారంలో ఉన్నారు. దర్యాప్తు సంస్థలను పంపి విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ఓటమి భయంలో జగన్ ఏం మాట్లాడుతున్నారో.. వైసీపీ నేతలు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ ఐదేళ్లు సైలంట్ గా ఉండి ఎన్నికల ముందు అబద్దాలు ప్రచారం చేస్తే నమ్మడానికి జనం సిద్దంగా లేదని ద్వజమెత్తారు.

బోండా ఉమా అన్నట్టు నిజంగానే ఆయన అవినీతి చేస్తే.. ఇంత వరకూ ఎందుకు ఒక్క వార్తను కూడా రాయలేదు? వ్యవస్థలు అన్నీ ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్నాయి కదా? చంద్రబాబునే జైలుకు పంపారు. తప్పు చేస్తే బోండా ఉమాను జైలుకు పంపలేరా? ఎందుకు సైలంట్ గా ఉన్నారో ఈ వార్తలును సర్క్యూలేట్ చేస్తున్నవారు చెప్పాలి. ఇంతవరకు సైలంట్ గా ఉండి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలకు కూడా అర్థం అవుతుంది. ఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని. అవినీతి ఆరోపణలు ఎన్నికల ముందు అధికార పార్టీపై.. ప్రతిపక్షాలు చేస్తాయి. కానీ, ప్రతిపక్షాలపై అధికార పార్టీ చేస్తే.. అధికార పార్టీ నేతలు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అదే, ప్రతిపక్షాలు అయితే.. ఆరోపణలు చేస్తే చాలు.. సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని వైసీపీ గ్రహిస్తే మంచింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -