Land Titling Act: ఏపీలో భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం.. ప్రభుత్వ, దేవాలయ భూములకు దిక్కే లేదా?

Land Titling Act: వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. సంచలనం.. ఆ తర్వాత వివాదాస్పదం అవుతోంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడం కష్టం. దీంతో.. దాని సంబందించిన అన్ని పనులు స్థంబించిపోతాయి. గతంలో జరిగిన పనులు ఇక యథావిథిగా జరగకుండా ఆగిపోతాయి. మూడు రాజధానుల వ్యవహారమే తీసుకుందాం. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులను జగన్ ప్రకటించారు. అలా అని మూడు ప్రాంతాల్లో మూడు బిల్డింగులు కూడా కట్టలేదు. కానీ, ఏపీ రాజధాని అమరావతికి ఆనవాళ్లు లేకుండా చేశారు.

ఇప్పుడు ఏపీ భూ యాజమన్య హక్కు చట్టం 2022 కూడా ఇలాగే వివాదస్పదం అవుతోంది. ఈ చట్టం 2023 అక్టోబర్ 31 నుంచి అమలులోకి వచ్చింది. కానీ, దానిపై న్యాయ కోవిదులు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలా అని చట్టాన్ని వెనక్కి తీసుకోలేదు. అందరి సలహాలు తీసుకుంటామని చెబుతోంది. అది కూడా ఎన్నికల సమయం కావడంతో ఆ మాట చెబుతోంది. లేదంటే మొండిగా ఆచట్టాన్ని అమలు చేసి ఉండేది.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులో ఎదురుదెబ్బ తప్పడం లేదు. అందుకే, భూ వివాదాలను కోర్టు పరిధి నుంచి తప్పించి వాటి కోసం ప్రత్యేకంగా ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసింది. సివిల్ వివాదాలు కోర్టుల్లోనే పరిష్కారం అవ్వాలి. కానీ, భూ సమస్యలపై అవగాహన లేని వారి దగ్గర పరిష్కారం అవుతాయి అనుకుంటే పొరపాటే. కానీ.. కొంతమంది అధికారులను నియమించి భూ హక్కులను నిర్ణయించే అధికారం వారికి ఇచ్చింది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అధికారులు.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పని చేస్తారు. ఇది కాదనలేని సత్యం. ఇలాంటి అధికారుల నుంచి రక్షణ కోసమే కోర్టులు ఉంటాయి.

కానీ, భూ వివాదాలతో కోర్టులకు పని లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇద్దరి మధ్య భూ వివాదం జరిగితే అధికారులు ఎవరికి చెబితే వారికే ఆ భూమి అవుతోంది. అధికారులు ఎవరి ఒత్తళ్లకు తలొగ్గకుండా పని చేస్తారని ఎలా అనుకుంటాం? అసలు ఆ భూమి ఎవరిదో అధికారులు ఎలా నిర్ణయిస్తారు? అలాంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి అనుభవం ఉన్న వారిని అధికారులుగా నియమిస్తారు? వాలంటీర్, సచివాలయ వ్యవస్థకే భూవివాదాలను అప్పగిస్తారా? ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. భూ హద్దులను నిర్ణయించేది కూడా ఈ అధికారులే. గ్రామాల్లో తరచూ హద్దుల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. మరి హద్దులను ఎలా నిర్ణయిస్తారు? వీటికి జగన్ సర్కార్ సమాధానం చెప్పాలి. దీని వలన ప్రభుత్వ భూములకు, దేవాయల భూములకు కూడా రక్షణ లేకుండా పోతుంది. అధికారులు మనవాళ్లు అయితే.. ఏ భూమి అయినా మన సొంతం అవుతుంది అన్న చందంగా అధికార పార్టీ నేతలు వ్యవరిస్తారు. దీనిపై ఏపీ న్యాయవాదుల మండలి హైకోర్టులో పిల్ వేసిందంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -