Hemant Soren: హేమంత్ సోరెన్‌కు ఓ న్యాయం.. జగన్‌కు ఓ న్యాయమా?

Hemant Soren: రాజకీయాల్లో అందరికీ ఒకే న్యాయం ఉండదు. అవకాశవాద రాజకీయాలే ఎక్కువే ఉంటాయి. తమకు అనుకూలంగా ఉన్నవారికి కొమ్ముకాస్తారు.. వ్యతిరేకంగా ఉంటే దెబ్బకొట్టాలని చూస్తారు. అందుకే రాజకీయమంటేనే అవకాశవాదం, కుట్రలు, కుంతంత్రాలు. రాజకీయ రోచ్చులోకి దిగితే ఇక దాని నుంచి బయట పడటం కష్టమే. అధికారంలోకి ఉన్న నేతలు ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి బజారు కీడుస్తారు. అధికార పార్టీ చెప్పింది చేస్తేనే రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతాం.. లేకపోతే ఇక అంతే సంగతులు.. రాజకీయ జీవితం గోదార్లో కలిసినట్లే.. ప్రస్తుతం నడస్తున్న రాజకీయాలు ఇలాగే ఉున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ల వ్యవహారం చూస్తుంటే అవకాశవాద రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. తాజాగా హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సూచనతో సోరెన్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవిని దుర్వినియోగం చేశారని, తన కంపెనీకి మైనింగ్ కేటాయించుకున్నారనే ఆరోపణలపై ఆయనపై వేటు వేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఈసీ గుర్తించింది.

గత సంవత్సరం తన కంపెనీకి రాయి మైనింగ్ లీజును కేటాయించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈసీ గుర్తించింది. దీంతో గవర్నర్ కు ఈసీ రిఫర్ చేయడం, గవర్నర్ వెంటనే అనర్హత వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రద్దు చేయడం సంచలనమైంది. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసే పరిస్ధితులు వచ్చాయి. హేమంత్ సోరెన్ కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై సోషల్ మీడియాలో గొంతెత్తుతున్నారు. దీంతో సోరెన్ మీద ఉన్న కక్షతో ఆయనపై కేంద్రం పగ పట్టిందని అంటున్నారు. అందుకే గవర్నర్ ను అడ్డుపెట్టుకుని అనర్హత వేటు వేయించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ హేమంత్ సోరెన్ పై తీసుకున్నట్లుగానే.. సీఎం వైఎస్ జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన సొంత పత్రిక సాక్షికి నెలకు రూ.30 కోట్ల ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో సాక్షికి ఇస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పల్నాడు ప్రాంతంలో సరస్వతి పవర్ కంపెనీకి పెద్ద ఎత్తున గనుల కేటాయింపులు చేసుకున్నారనే ఆరోపణలు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తు్న్నాయి. అలాగే తనకు చెందిన పలు కంపెనీలకు నీటి కేటాయింపులు కూడా చేసుకున్నారు. ఇక ప్రభుత్వ ప్రాజెక్టులు, నిర్మాణలకు భారతీ సిమెంట్ నుంచే సిమెంట్ కొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా జగన్ అధికార దుర్వనియోగానికి పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు బయటపెడుతున్నారు.

దీంతో హేమంత్ సోరెన్ పై చర్య తీసుకున్న ఈసీ.. సీఎం జగన్ పై ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. సోరెన్ కు ఓ న్యాయం.. జగన్ కు ఓ న్యాయమా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. జగన్ పై కూడా ఈసీ చర్యలు తీసుకుని ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు. హేమంత్ సోరెన్ వ్యవహారంతో సీఎం జగన్ టాపిక్ కూడా తెరపైకి వచ్చింది. అయితే హేమంత్ సోరెన్ జార్ఖండ్ లో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై రోజూ విమర్శలు కురిపిస్తు్న్నారు. ఇటీవల పెద్ద ఎత్తున ఐటీ దాడులు కూడా జరిగాయి. అందులో భాగంగానే ఆయనపై ఈసీ చర్య తీసుకుందనే భావన కలుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -