AP Politics: జగన్ పై జనంలోనే కాదు పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా వ్యతిరేకత ఉందా?

AP Politics: అధికారబలం ఉంటే ఏమైన చేయవచ్చనే దానికి ప్రత్యేక్ష నిదర్శనం వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పరిస్థితి అటు ఉంచితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సముచిత స్థానం లేదు. దీంతోనే పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని దిక్కరించారు. ఇక లాభం లేదని నెల్లూరు రెడ్లు తిరగబడ్డారు. ఆ తిరుబాటే టీడీపీకి కలిసి వచ్చింది. మెున్న పట్టభద్రుల ఎన్నికలు, ఈసారి ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల్లో వైసీపీకి షాక్ ఇచ్చింది టీడీపీ.

2019 ఎన్నికల్లో జగన్ సునామీకి తీవ్రంగా దెబ్బతాకింది టీడీపీకి. ఎంతలా అంటే 23 సీట్లకు పరిమితం అయ్యేంత. ఇక ఈ సందర్భంలోనే జగన్ కు 151 సీట్ల వచ్చాయి. దీంతో ఆయన మాట్లాడేది సత్యం, చేసేదే కార్యం అన్నట్లు రాష్ట్రంలో తయారైంది. కానీ పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోచెమ్మ కొట్టిందట అట్లనే జగన్ కు జరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

ఇక తాజాగా జరిగిన రెండు ఎన్నికల్లో టీడీపీ బాగా పుంజుకుంది. అన్యూహ విజయాలు నమోదు చేసింది. తెలుగు తమ్మళ్లల్లో జోష్ నింపింది. మరింత పోరాటే శక్తిని ఇచ్చింది. మెున్న పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. విశాఖ రాజధాని పెడతామన్న చదువుకున్న యువత జగన్ ను నమ్మలేదని టీడీపీ అంటోంది. ఇటు రాయలసీమ ప్రాంత వాసులు కూడా జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

ఇప్పటి వరకు ప్రజలు వైసీపీ అధినేత జగన్ ను తిరస్కరిస్తే, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యే స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ పంచమర్తి అనురాధను నిలబెట్టింది. ఆమె గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇక వైసీపీ ఎగతాలి కూడా చేసింది. కానీ వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయగా, ఆమె గెలిచింది. దీంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది.

 

ఇక వ‌రుస‌గా నాలుగు ఎమ్మెల్సీల‌ను ద‌క్కించుకున్న టీడీపీ, క్యాడరన్ మరింత భలోపేతం చేసే దిశగా పయనిస్తోంది. ఈ సారి ఎలాగైనా సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని పట్టుబిగిస్తోంది. వైసీపీని ఇలానే వచ్చే ఎన్నికల్లోనూ ఓడించాలని ప్రజలను కోరుతోంది. కార్యకర్తలు వచ్చే ఏడాది ఎన్నికల వరకు గట్టిగా పోటీ చేయాలని బాబు పిలుపునిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -