Jagan: జగన్ సీఎం కావాలో వద్దో పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తారా?

Jagan: ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం వేడివేడిగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయము ఉండగానే అప్పుడే ఎన్నికలకు సంబంధించిన వేడి మొదలైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ జరిగే ఎన్నికలలో తామే గెలుస్తాము అన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. మరొకవైపు జనసేన, టీడీపీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేసాయి. జనసేన సంగతి పక్కన పెడితే టీడీపీ యువనేత నారా లోకేష్ ఇప్పటికే యువగలం పాదయాత్ర పేరుతో ఏపీ లోని పలు జిల్లాలను సందర్శించిన విషయం తెలిసిందే. వచ్చి ఏడాది ఎలా అయినా గెలవాలి అన్న కసితో టీడీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ ఉన్నారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో టిడిపి ఘనవిజయం సాధించడంతో వైసీపీకి ఓటమి మొదలయ్యిందని టిడిపి అధికారంలోకి రాబోతోంది అనడానికి ఎగ్జాంపుల్ ఇదే అంటూ టిడిపి నేతలు సంకలు గుద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ టీడీపీ అలాగే జనసేన ఒక పార్టీ నేతలు మరొక పార్టీ నేతల మధ్య మాటలు యుద్దాలు నడుస్తున్నాయి. ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో టిడిపి కి వైసీపీకి మధ్య అసలైన పోరు జరగబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే సీఎం మళ్లీ జగన్ కాలేరని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. జగన్ సీఎం కావాలో వద్దో పవన్ డిసైడ్ చేసే ఛాన్స్ జనసేనకి ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కనుక గట్టిగా తలుచుకుంటే ఏపీ సీఎం జగన్ పరిస్థితి మారిపోతుందని మళ్లీ ఎప్పటికీ సీఎం అయ్యే పరిస్థితిలో ఉండవు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన జనసేన నేతలు వాటికి మద్దతు తెలుపుతుండగా, వైసీపీ నేతలు మాత్రం అవన్నీ పగటికలలె అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -