Presidential Elections: బీజేపీ, కాంగ్రెస్ లో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయంటే?

Presidential Elections: ప్రతి పార్టీలో సంస్ధాగత ఎన్నికలు జరుగుతాయి. పార్టీలోని పదవులను ఎన్నికల ద్వారా భర్తీ చేస్తారు. ప్రతి పార్టీకి ఒక రాజ్యాంగం రూపొందించుకుంటుంది. ఈ రాజ్యాంగం ప్రకారం పార్టీలోని పదవుల కోసం నియామకాలు, ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం పార్టీ ఆ దారిలో నడుస్తూ ఉంటుంది. కావాలనప్పుడల్లా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేసుకుంటూ ఉంటాయి. దాని ప్రకారం పార్టీలోని మండల, జిల్లా, రాష్ట్ర పదవులకు ఎన్నికలు నిర్వహించిన భర్తీ చేస్తారు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ తో పాటు బీజేపీలోని అధ్యక్ష పదవికి ఎన్నికలు ఎలా జరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ఉంటాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో 1500 మంది సభ్యులు ప్రస్తుతం ఉన్నారు. వీళ్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి 24 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఇక దేశవ్యాప్తంగా 35 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉన్నాయి.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల్లో 9 వేల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఎన్నికల అథారిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ ఎన్నికల అథారిటీకి చైర్మన్ ను నియమిస్తారు. ప్రస్తుతం ఎన్నికల అథారిటీ చైర్మన్ గా మధుసూదన్ మిస్ట్రీ ఉన్నారు. ఈ ఎన్నికల అథారిటీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల అథారిటీలను ఏర్పాటు చేస్తుంది. వీళ్లు జిల్లా, బ్లాక్ స్థాయి ఎన్నికల అథారిటీలను ఏర్పాటు చేస్తారు. పీసీసీ సభ్యులందరూ ఎన్నికలో పాల్గొంటారు. ఒకరికంటే ఎక్కువమంది అధ్యక్ష పదవి రేసులో ఉంటే తాము ఓటు వేసే వారి పేరును రాసి బ్యాలెట్ బాక్స్ లో వేయాలి.

ఇక బీజేపీ విషయానికొస్తే.. జాతీయ మండలి సభ్యులు, రాష్ట్ర మండలి సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగుతుంది. కానీ బీజేపీలో ఎక్కువగా ఏకగ్రీవంగానే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. బీజేపీ నేతలు ఒక పేరును ఫైనల్ చేసిన ఆర్ఎస్ఎస్ కు పంపతారు. ఆర్ఎస్ఎస్ఎస్ పరిశీలించి అధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -