Jalsa Movie: బ్లాక్ లో కూడా దొరకని జల్సా టికెట్లు.. ఇంత క్రేజా?

Jalsa Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో సూపర్ స్టార్ అయినా నిజ జీవితంలో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. ఒక్కో సినిమాకు ఊహించని రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఆ డబ్బులో ఎక్కువ మొత్తం పేద ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ ఖర్చు చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ మేనియాకు జల్సా మూవీనే నిదర్శనం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సాధారణంగా పాత మూవీలు రీరిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ నుంచి స్పందన ఉన్నా మరీ ఊహించని స్థాయిలో స్పందన ఉండదనే సంగతి తెలిసిందే. 700కు పైగా జల్సా సినిమా షోలు ప్రదర్శితం కాగా బ్లాక్ లో కూడా జల్సా టికెట్లు లభించని పరిస్థితి ఉందంటే ఈ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రీరిలీజ్ సినిమాలకే ఈ స్థాయి క్రేజ్ అంటే కొత్త సినిమాలకు ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుందని అధికారక ప్రకటన వెలువడింది. ఈ సినిమాతో పవన్ కోరుకున్న కెరీర్ బెస్ట్ హిట్ దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాల షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఆ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో క్లారిటీ రావాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల సమయానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ లు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇతర హీరోలతో మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు పవన్ రేంజ్ పెరుగుతుండగా పవన్ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -