Sri Reddy: హైపర్ ఆదిపై శ్రీరెడ్డి ఫైర్.. నీచుడు అంటూ?

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎంత వివాదాలు సృష్టిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్​ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సినీ స్టార్స్ తోపాటు రాజకీయ నేతల పైనా శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పార్టీకి ఆమె పరోక్షంగా మద్దతు తెలుపుతూ ఉంటారు. ఆ పార్టీపై లేదా జగన్ ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శలు చేస్తే.. శ్రీరెడ్డి వారి మీదా విరుచుకుపడతారు.

 

టీడీపీ, జనసేన నేతలపై శ్రీరెడ్డి ఎన్నోమార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆమె ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆదిని టార్గెట్ చేశారు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఆది.. తొలి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్​కు మద్దతుదారుడిగా ఉన్నారు. పవన్ అంటే ఆదికి పడి చచ్చేంత ఇష్టమనేది అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు.

 

జగన్ ఊసెత్తని ఆది
ఇదిలాఉంటే.. ఇటీవల వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ కార్యక్రమానికి మంత్రి ఆర్కే రోజా ‘జబర్దస్త్’ టీమ్ ను పిలిపించారు. ఈ ప్రోగ్రామ్ కు హైపర్ అది కూడా హాజరయ్యారు. ఆయనతోపాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ, యాంకర్ అనసూయ, మహేష్, రోహిణి లాంటి వాళ్లు కూడా పాల్గొన్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ హైపర్ ఆది మాత్రం జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.

 

జగన్ బర్త్ డేకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆది.. ఏపీ సీఎం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, అసలు ఆయన ప్రస్తావనే తీసుకురాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై శ్రీరెడ్డి రెచ్చిపోయారు. ‘ఆది కుక్క బుద్ధి చూపించాడు. వీడికి డబ్బులిస్తే ఏ గడ్డయినా తింటాడు. అరేయ్, నీకు డబ్బులిస్తే ఏ పెంటయినా నాకుతావా? మంత్రి రోజా పిలవొచ్చు.. నువ్వు కొంపదీసి వైసీపీలోకి మారిపోయావా? అలా మారితే చెప్పు మాకేం సమస్య లేదు. కానీ జగనన్న బర్త్ డేకు వచ్చి నువ్వు జగన్ పేరు ఎత్తకుండా ఎలా మాట్లాడతావ్? నువ్వు నీచుడివి’ అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై ఆది ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -