YSRCP-I PAC : వైసీపీ గెలుపు కోసం ఐ ప్యాక్‌ ప్లాన్‌ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ల గత ఎన్నికల్లో భారీ సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో సారి అధికారం చేజిక్కించుకోవాలనే కసరత్తులు ప్రారంభించింది. గతేడాది నుంచి మరిన్ని కొత్తకొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను మరోమారు గట్టేక్కించేలా ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్‌ సంస్థ అందుకు తగ్గ కసరత్తులు ప్రారంభించింది. నేరుగా కిషోర్‌ పని చేయకున్నా ఆయన అత్యంత సన్నిహితుడు రుషిరాజ్‌ సింగ్‌ బృందం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన వెళ్లి సర్వేలు చేపట్టి నివాదికలు సమర్పిస్తోంది.

సర్వేలో భాగంగా ఏ ఏ ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తోందో అక్కడ చేయాల్సిన పనులు, వ్యూహాలు పన్ని తగు సూచనలు సలహాలు చేస్తుంది. గతే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఐప్యాక్‌ సోషల్‌మీడియాను అస్త్రంగా వాడింది.ఈ సారి కూడా అదే తీరును ప్రదర్శిస్తోన్నట్లు సమాచారం. అయితే సోషల్‌ మీడియాలో పనిచేయడానికి మహిళలను అధిక సంఖ్యలో తీసుకోనున్నారు. ఎందుకంటే వీరికి అధిక రక్షణ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మహిళలు పోస్టులు చేస్తే ప్రతిపక్షాలు వాటిపై తీవ్ర విమర్శలు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం మహిళలు కేసులు నమోదు చేయొచ్చు. ఇంకా ఎవరైనా తీవ్రపదాజాలలతో విమర్శలు గుప్పిస్తే దాడికి యత్నిస్తే మహిళలపై దాడి చేయడం అన్యాయమంటూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లోచ్చనే ప్రణాళిక ఐప్యాక్‌ రూపొందించినట్లు తెలిసింది.

మహిళల పోస్టులను ఎక్కువగా చూస్తారని.. సంక్షేమ పథకాల గురించి మహిళలు ప్రస్తావిస్తే శ్రద్ధగా ఉంటారని ఐ ప్యాక్‌ భావిస్తోంది. దీనికి తోడు ప్రతిపక్షాలు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తే వాటికి సరైన రీతిలో మహిళలు తిప్పగొడుతారని అందుకే మహిళలనే ఎంచుకోనున్నారు. గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ‘ కావాలి జగన్‌.. రావాలి జగన్‌’ అనే అర్థమయ్యే రీతిలో నినాదాన్ని రూపొందించిన ఐ ప్యాక్‌ సంస్థ ఈ సారి మరో నినాదాన్ని తయారు చేస్తోంది. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు సీనియర్‌ నేతలకు నివేదికలు ఇస్తూ తదుపరి ప్రణాళిలను రూపొందిస్తూ గెలుపే లక్ష్యంగా ఐ ప్యాక్‌ సంస్థ నిరంతరం పని చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -