Bangalore: మిస్టర్ ఆంధ్రగా గుర్తింపు.. కానీ అలాంటి తప్పుడు పనులు చేస్తూ?

Bangalore: ఇటీవల కాలంలో చాలామంది మంచి మంచి గొప్ప స్థాయిలో ఉన్నవారు ఊహించని దారుణాలకు ఒడిగడుతున్నారు. బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్నవారు అత్యాచారాలకు దొంగతనాలకు పాల్పడడం హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా అలాంటి అలాంటి వాడే అని చెప్పవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల సయ్యద్‌ భాషా బాడీ బిల్డింగ్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా మిస్టర్‌ ఆంధ్రాగా టైటిల్‌ కూడా గెలుచుకున్నాడు.

అలాంటి వ్యక్తి బెంగళూరుకు వెళ్లాడు. అయితే బెంగుళూరుకి పని కోసమో ఉద్యోగం కోసమో కాదండోయ్, దొంగతనాలు చేయటానికి. బెంగళూరులోని ఒక లాడ్జీలో తన మిత్రుడు షేక్‌ అయోబ్‌తో దిగిన సయ్యద్‌ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇక ఇద్దరూ కలిసి నగరంలోని వీధి వీధి తిరిగి కనిపించిన బైకులను దొంగలించేవారు. అలా దొంగిలించిన బైకుపై చైన్‌ స్నాచింగ్‌లు చేసేవారు. చైన్‌ స్నాచింగ్‌ తర్వాత బైకును ఒక చోట వదిలేవారు. ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత దొంగిలించిన చైన్‌ను అమ్మి సొమ్ము చేసుకునేవారు. ఇలా చాలా దొంగతనాలు చేశారు.

 

ఇది ఇలా ఉంటే ఇటీవల కొద్దిరోజుల క్రితం గిరినగర పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో జానకీ అనే మహిళ చైన్‌ను దొంగతనం చేశారు. ఈ సారి తన సొంత బైకు తీసుకుని సయ్యద్‌ దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగతనం చేసి పారిపోయే తొందరలో బైకును అక్కడే వదిలేసి పారిపోయాడు. దాంతో బాధితురాలు చైన్‌ స్నాచింగ్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడు తన బైకును అక్కడే వదిలి పారిపోయినట్లు గుర్తించారు. ఆ బైకు కోసం సయ్యద్‌ మళ్లీ వస్తాడని పోలీసులు భావించారు. అతడ్ని పట్టుకోవటానికి ఒక ప్లాన్ వేశారు. జీపీఎస్‌ ట్రాకర్‌ను బైకుకు అంటించారు. వారు ఊహించినట్లుగానే సయ్యద్‌ బైకు కోసం వచ్చాడు. బైకును తీసుకుని వెళ్లిపోయాడు. జీపీఎస్‌ యాక్టివేట్‌ అవ్వటంతో అతడు ఎక్కడికి వెళ్లాడో పోలీసులకు తెలిసింది. సయ్యద్‌ ఉండే ప్రాంతానికి వెళ్లిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు షేక్‌ అయూబ్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. దాంతో అతడు చేసిన పనులన్నీ కూడా వచ్చాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -