Public Provident Fund: రూ.500 వందలతో పీపీఎఫ్‌లో పెడితే రూ.40 లక్షలు సొంతం!

Public Provident Fund: నేటి కాలంలో డబ్బుంటేనే మనుషులకు విలువ ఉంటుంది. ప్రపంచంలో అన్నింటికి మూలం డబ్బే అని చెప్పక తప్పడం లేదు. ఏం కావాలన్నా.. ఏం సాధించాలన్నా డబ్బుతోనే సాధ్యం. డబ్బు లేకుంటే ఏ పని కూడా జరగదు. అందుకే డబ్బుల సంపాదించేందుకు వివిధ రకాల పనులు, ఉద్యోగులు, వ్యాపారాలు చేస్తుంటారు. తల్లిదండ్రులు తాము డబ్బు సంపాదించేందకు ఎంత కష్టపడ్డారో అలాంటి కష్టాలు తమ పిల్లలకు రాకూడదని డబ్బును వారు పెద్దయ్యే వరకూ పొదుపు చేస్తుంటారు.వారు జీవితాంతం కష్టపడేవి వారికన్నా వారి పిల్లల బాగు కోసమే. తల్లిదండ్రుల వారి వారి ఇష్టాలను పక్కనబెట్టి పిల్లల భవిష్యత్‌ గురించి ఓ చక్కటి మార్గానికి దారి వేస్తుంటారు. అయితే..

చిన్న చిన్న మొత్తాలను ప్రభుత్వ ప«థకాల్లో పెట్టుబడిగా పెడితే మన పిల్లలు పెద్దయ్యే వరకు వారి అవసరాలకు అనుగుణంగా భారీగా డబ్బులు వారికి అందుతాయి.అలాంటి పథకాల్లో ‘పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌’ ఒకటి. పిల్లల పేరుపైనే నేరుగా పీపీఎఫ్‌ అకౌంట్‌ తెరవచ్చు. అయితే పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు గార్డియన్‌ సదరు అకౌంట్‌ నిర్వహణ చూసుకుంటారు. ఇక పీపీఎఫ్‌ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఆ తరువాత అవసరం అనుకుంటే పీపీఎఫ్‌ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌ ఖాతాపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే ఏడాదిలో రూ. 1. 50 లక్షల వరకు డబ్బులను పీపీఎఫ్‌ ఖాతాలో దాచుకోవచ్చు.

కాగా.. ఏడాదికి మినిమం రూ. 500 జమ చేసినా కూడా పీపీఎఫ్‌ అకౌంట్‌ నడుస్తోంది. అందులో పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్నుచట్టంలోని సెక్షన్‌ 80–సీ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌ ఖాతాలో 1. 50 లక్షల చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 40 లక్షలు చేతికి అందుతాయి. ఈ డబ్బులతో పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లకు ఖర్చు చేçయవచ్చు. మనకు ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే రుణం కూడా తీసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -