Akhil Akkineni: అక్కినేని అఖిల్ పై విమర్శలు చేస్తే ఇవి గుర్తు పెట్టుకోవాల్సిందే!

Akhil Akkineni: అఖిల్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయిన అక్కినేని అఖిల్ ప్రతి సినిమాకి కష్టపడుతూ తనని తాను నటుడుగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మొదటి సినిమా హలో ఫ్లాప్ కాగా, రెండో సినిమా హాలో కూడా ఓకే, ఓకే గా నిలిచింది. తర్వాత విడుదలైన మిస్టర్ మజ్ను సినిమా కూడా అంతగా ప్రజాధరణకు నోచుకోలేదు.

కానీ ప్రతి సినిమాకి అఖిల్ నటన మాత్రం మెరుగు పడుతూనే వచ్చింది ఎప్పటికప్పుడు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఒక మంచి హిట్ కూడా పడకపోవడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ప్రముఖ కథానాయక అయిన పూజా హెగ్డే తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీసాడు.

 

అఖిల్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. తనని తాను ఎంతో ఇంప్రూవ్ చేసుకుని చాలా కష్టపడి ఈ సినిమాలో పూజా హెగ్డే తో ఏమాత్రం తగ్గకుండా నటించాడు అఖిల్. కానీ క్రెడిట్ అంతా బుట్ట బొమ్మ వైపే మళ్ళింది, తను ఉండడం వల్లే సినిమా హిట్ అయింది అని వార్తలు కూడా వచ్చాయి.

 

అయితే అఖిల్ తర్వాత తీయబోయే సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు చాలా ఆరాటపడగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా పోస్టర్ చూడగానే ప్రేక్షకులందరికీ భారీ అంచనాలు పెరిగాయి. అందులో అఖిల్ సిక్స్ ప్యాక్ తో బాడీ పెంచి చాలా వైల్డ్ గా కనబడ్డాడు. అదే కాకుండా అందులో మమ్ముట్టి ఉండడం చూసి అంచనాలను ఇంకా పెంచేసుకున్నారు ప్రేక్షకులు.

ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ప్రతిసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. అయితే నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా స్టార్టింగే డిజాస్టర్ టాక్ తో మొదలైంది. మంచి పాటలు గానీ మంచి ఫైట్ గాని మంచి కథనం కూడా లేని ఈ సినిమా అఖిల్ జీవితంలో అత్యంత పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

 

ప్రేక్షకులందరూ అఖిల్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కానీ ఈ సినిమా పరాజయం కావడానికి కారణం అఖిల్ మాత్రమే కాదు సురేందర్ రెడ్డి మరియు అతని టెక్నికల్ టీం కూడా. పాటలు దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేదు.ఒక టీంలో అందరూ కలిసి కష్టపడితేనే అది ఒక మంచి విజయాన్ని సంపాదించుకోగలదు కానీ అలా జరగకపోవడం విచారకరం.

 

చాలామంది ప్రేక్షకులు అఖిల్ ని ట్రోల్ చేస్తూ ఉండగా కొంతమంది మాత్రం అఖిల్ ని సపోర్ట్ చేస్తూ మంచి కథలను ఎంచుకుంటే మంచి మంచి హిట్లను సంపాదించుకోగలడు. తనకి అటువంటి టాలెంట్ ఉన్నది చాలామంది హీరోలు కన్నా అఖిల్ నటన బానే ఉంటుంది అని అఖిల్ ని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత అఖిల్ కెరీర్ మలుపు తిరిగే సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -