Akkineni Heroes: ఆ ఒక్క లక్షణమే అక్కినేని హీరోలను ముంచేస్తోందా?

Akkineni Heroes: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోలు కెమెరా ముందు ఒకవైపు కెమెరా వెనుక ఒకవైపు నటిస్తూ ఉంటారు. ఇలా సందర్భం బట్టి వారి అభిప్రాయాలు వారి ప్రవర్తన తీరు కూడా మారుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో అక్కినేని హీరోలు పూర్తిగా భిన్నమని చెప్పాలి. ఎందుకంటే ఇతర హీరోల మాదిరిగా వీరికి కెమెరాల ముందు నటించడం రాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు.

తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య డైరెక్టర్ పరుశురామ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో మనకు తెలిసిందే. పరశురామ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని,అతడు నా టైం మొత్తం వేస్ట్ చేశారు అంటూ మొహం మీద చెప్పేశారు. ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అక్కినేని హీరోల నైజం అని చెప్పాలి. ఇకపోతే అఖిల్ కూడా తన సినిమాలు ఫ్లాప్ అవడంపై మాట్లాడుతూ సినిమాలు ఫ్లాప్ కావడంలో తనకు కూడా బాగా ముందని తెలిపారు.

 

ఇక ఈ అక్కినేని యువ హీరోలు మాత్రమే కాదు తన తండ్రి కూడా ఇదే రేంజ్ లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వారి నైజం. నాగార్జున కూడా గతంలో ఓ సినిమా సక్సెస్ కావడంతో అసలు ఈ సినిమా ఎలా సక్సెస్ అయిందో నాకే తెలియడం లేదంటూ నవ్వేశారు. అంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందని తనకు కూడా నమ్మకం లేదు.అలాగే మరొక సినిమా ఫెయిల్యూర్ కావడంతో డైరెక్టర్ ను మీడియా సమావేశంలోనే బండబూతులు తిట్టారు.

 

ఇలా ఈ అక్కినేని హీరోలు ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు అయితే ఇదే వారికి ఇబ్బందిగా మారిందని తెలుస్తుంది. కనీసం కెమెరాల ముందు ఏ విషయం గురించి మాట్లాడాలన్న నటించడం రాకపోవడమే ఈ హీరోలకు ఇబ్బందిగా మారిందని అందుకే సక్సెస్ కాలేకపోతున్నారంటూ కూడా మరికొందరు ఈ విషయంపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే నిజాయితీగా మాట్లాడటం వల్ల తమకు చాలా హ్యాపీగా ఉంటుందని అందుకే ఇలాగే మాట్లాడతామంటూ అక్కినేని హీరోలు చెప్పుకొస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -