Balayya: బాలయ్య అల్లుడు అక్కడినుంచి పోటీ చేస్తే మాత్రం కచ్చితంగా గెలుస్తారా?

Balayya: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ గురించి మనందరికీ తెలిసిందే. గీతం విద్యాసంస్థల అధినేతగా భరత్ మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం భరత్ ఒకవైపు విశాఖ ఎంపీ సీటు మీద ఆలోచిస్తూనే మరో వైపు భీమునిపట్నం అసెంబ్లీ సీటు మీద కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది. భీమిలీలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు చాలామంది ఉన్నప్పటికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీద పోరు అంత తేలిక కాదని అంటున్నారు.

అందువల్ల విశాఖ ఎంపీ సీటు పొత్తులలో పోతే భీమిలీ నుంచి పోటీకి బాలయ్య చిన్నల్లుడు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఆయన తరచుగా భీమిలీలో టూర్లు వేస్తున్నారని అంటున్నారు. ఆయన గీతం విద్యా సంస్థలు కూడా భీమిలీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఆయన పోటీ అంటే భీమిలీ తమ్ముళ్లు కూడా తగ్గి ఓకే అంటారని చెబుతున్నారు. కానీ భీమిలీ సీటు మీద జనసేన పట్టు పడుతోంది అని ప్రచారం సాగుతోంది. పంచకర్ల సందీప్ అన్న యువనేతకు ఈ సీటు విషయంలో జనసేన అధినేత హామీ ఇచ్చారని అంటున్నారు 2019లో పంచకర్ల మొదటి సారి పోటీ చేసి దాదాపుగా పాతిక వేల ఓట్లను కొల్లగొట్టారు.

 

ఈసారి గెలిచి వస్తాను అని ఆయన జనసేన అధినాయకత్వానికి ప్రామిస్ చేశారని అంటున్నారు. భీమిలీ 2009లో ప్రజరాజ్యం పార్టీ గెలుచుకున్న సీటు. ఆ సెంటిమెంట్ తో జనసేన దీన్ని పొత్తులో కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బాలయ్య అల్లుడు భీమిలీ మీద ఆశలు పెంచుకున్నా పొత్తు వల్ల ఇబ్బంది కావచ్చు అంటున్నారు. అటు ఎంపీ సీటు పొత్తులో బీజేపీకి పోతే ఇటు భీమిలీ సీటుని జనసేన కొట్టుకుపోతే పోటీ చేయడానికి ఏముంది అన్నదే బాలయ్య చిన్నలుడుకి పట్టుకున్న బెంగ అంటున్నారు. మరి బాలయ్య అల్లుడికి సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -