NTR: ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ బాబు బలయ్యాడా.. అసలేం జరిగిందంటే?

NTR: ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా రిజల్ట్స్ అంజనాలను అందుకోలేకపోయాయి. కథలో దమ్ము లేకపోవడం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఎక్కడ తన మార్కుని ప్రదర్శించకపోవడం వంటివి సినిమాని డౌన్ చేసేసాయి. సినిమా ఆ మాత్రం ఆడుతుంది అంటే కేవలం మహేష్ బాబు వలన మాత్రమే. మహేష్ బాబు సినిమా మొత్తాన్ని వంటి చేత్తో నడిపించాడని చెప్పాలి. ఎందుకంటే మ్యూజిక్ దగ్గర నుంచి డైరెక్షన్ వరకు అన్నీ సినిమాలో మైనస్ అనే చెప్పాలి.

 

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో పండగ చేసుకుంటున్నారు అయితే మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అయినందుకు కాదు నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ కాంబినేషన్లో రావాల్సి ఉంది. అరవింద సమేత వీర రాఘవ వంటి గ్రాండ్ సక్సెస్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూసేవారు. అలాంటి సమయంలోనే అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ తో ఒక పొలిటికల్ టచ్ సినిమా చేయాలని అనుకున్నారు.

కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే అదే కధని అటు తిప్పి ఇటు తిప్పి గుంటూరు కారంగా టైటిల్ మార్చి త్రివిక్రమ్ సినిమా తీశారనే టాక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కధ అంతా పొలిటికల్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది అధికారంలోకి రావడం కోసం సొంత కూతురు కి కొడుకుని, భర్తని దూరం చేసిన తండ్రి.. తల్లికి దూరంగా పెరిగిన కొడుకు.. పొలిటికల్ గేమ్ లో భాగంగా మళ్లీ ఆ కుటుంబంలోకి ఎలా వచ్చాడు అనేది సినిమా లైన్.

 

అయితే ప్రేక్షకులు గతాన్ని మర్చిపోతున్నారు. బ్యాడ్ ఫేస్ లో ఉన్న ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇచ్చిన ఘనత త్రివిక్రమ్ ది. జయపజయాలు అనేవి సహజం అందుకని త్రివిక్రమ్ టాలెంట్ ని తక్కువ అంచనా వేసే పనిలేదు అంటూ త్రివిక్రమ్ ని వెనకేసుకొస్తున్నారు ఆయన అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైసీపీ వాళ్ల ముఖాలు చూస్తే ఓటమి అర్థమవుతోందా.. సర్వేలతో సైతం పని లేదుగా!

YSRCP: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే విషయం గురించి పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించారు. ఇలా లోకల్ సంస్థల నుంచి మొదలుకొని నేషనల్ చానల్స్ కూడా...
- Advertisement -
- Advertisement -